
Rajasthan rape: రాజస్థాన్‌లో ఘోరం.. 4ఏళ్ల దళిత బాలికపై సబ్-ఇన్‌స్పెక్టర్ అత్యాచారం
ఈ వార్తాకథనం ఏంటి
4-year-old raped in Rajasthan: రాజస్థాన్‌లో దారుణం జరిగింది. ప్రజల భద్రతను చూసుకోవాల్సిన ఓ పోలీస్ అధికారి కీచకుడయ్యాడు.
అభంశుభం తెలియని 4ఏళ్ల దళిత బాలికపై ఓ పోలీస్ సబ్ ఇన్‌స్పెక్టర్ అత్యాచారానికి పాల్పడ్డాడు. ఈ ఘటన రాజస్థాన్‌లోని దౌసా జిల్లాలో లాల్సోట్ ప్రాంతంలో జరిగింది.
భూపేంద్ర సింగ్ అనే సబ్ ఇన్‌స్పెక్టర్ బాలికను శుక్రవారం మధ్యాహ్నం తన గదికి రప్పించి ఆమెపై అత్యాచారం చేశాడని ఏఎస్పీ రామచంద్ర సింగ్ వెల్లడించారు. నిందితుడిని అదుపులోకి తీసుకుని విచారిస్తున్నట్లు కూడా తెలిపారు.
విషయం తెలిసిన స్థానికులు పెద్ద సంఖ్యలో రహువాస్ పోలీస్ స్టేషన్‌ను ఘెరావ్ చేశారు. పోలీసులకు వ్యతిరేకంగా నినాదాలు చేశారు. పోలీసులకు నిందితుడిని అప్పగించే ముందు స్థానికులు భూపేంద్ర సింగ్‌కు దేహశుద్ధి చేసారు.
రాజస్థాన్
ఎన్నికల సమయంలో ఇలాంటి ఘటనలా: బీజేపీ ఎంపీ మీనా
బీజేపీ ఎంపీ కిరోడి లాల్ మీనా సంఘటనా స్థలానికి చేరుకుని లాల్సోట్‌లో బాలిక కుటుంబాన్ని పరామర్శించారు. ఈ ఘటనపై ప్రజల్లో తీవ్ర ఆగ్రహం వ్యక్తమవుతోందని, అమాయక బిడ్డకు న్యాయం చేసేందుకు నేను సంఘటనా స్థలానికి చేరుకున్నట్లు తెలిపారు.
అశోక్ గెహ్లాట్ ప్రభుత్వ అసమర్థత కారణంగా నిరంకుశంగా మారిన పోలీసులు, ఎన్నికల వంటి సున్నితమైన సందర్భంలో కూడా అఘాయిత్యాలకు పాల్పడడం మానుకోవడం లేదన్నారు.
నిందితుడు భూపేంద్ర సింగ్‌పై తీవ్రమైన చర్యలు ఉంటాయని, త్వరలో అతని ఉద్యోగం నుంచి తొలగించేలా చేస్తానని హామీ ఇచ్చారు.
బాధిత కుటుంబ సభ్యులందరికీ సాధ్యమైన అన్ని విధాలుగా పోలీసులు సహాయం అందిస్తారని మీనా వివరించారు.