Page Loader
Raghav Chadha: ఆప్ నేత రాఘవ్ చద్దా రాజ్యసభ సభ్యత్వం పునరుద్ధరణ 
Raghav Chadha: ఆప్ నేత రాఘవ్ చద్దా రాజ్యసభ సభ్యత్వం పునరుద్ధరణ

Raghav Chadha: ఆప్ నేత రాఘవ్ చద్దా రాజ్యసభ సభ్యత్వం పునరుద్ధరణ 

వ్రాసిన వారు Stalin
Dec 04, 2023
02:59 pm

ఈ వార్తాకథనం ఏంటి

ఆమ్ ఆద్మీ పార్టీ రాజ్యసభ ఎంపీ రాఘవ్ చద్దా పార్లమెంటు సభ్యత్వాన్ని పునరుద్ధరించారు. ఆయన సస్పెన్షన్‌ను రాజ్యసభ ఛైర్మన్ జగదీప్ ధన్‌కర్ ఉపసంహరించుకున్నారు. ఈ మేరకు రాజ్యసభ తీర్మానం చేసింది. రాఘవ్ చద్దా సస్పెన్షన్ అంశంపై రాజ్యసభ ప్రివిలేజెస్ కమిటీ సోమవారం పార్లమెంట్‌లో సమావేశమైంది. బీజేపీ ఎంపీ జీవీఎల్ నర్సింహారావు ప్రవేశపెట్టిన తీర్మానం తర్వాత సభ్యత్వాన్ని రద్దు చేశారు. రాజ్యసభలో దిల్లీ సర్వీసెస్ బిల్లుకు సంబంధించిన మోషన్‌లో ఐదుగురు ఎంపీల సంతకాలను ఫోర్జరీ చేసినట్లు జీవీఎల్ రాజ్యసభలో తీర్మానం ప్రవేశపెట్టారు. ఈ మేరకు చద్దా రాజ్యసభ ఛైర్మన్ సభ్యత్వాన్ని రద్దు చేశారు. ఈ అంశంపై సోమవారం సమావేశమైన ప్రివిలేజెస్ కమిటీ చద్దాను ఇప్పటి వరకు సస్పెండ్ చేసిన కాలం సరిపోతుందని అభిప్రాయపడింది.

ట్విట్టర్ పోస్ట్ చేయండి

రాఘవ్ చద్దా వీడియో