Page Loader
Ram Lalla Tilak: అయోధ్యలోని రామ్ లల్లాలో నుదుటిని తాకిన సూర్యకిరణాలు
అయోధ్యలోని రామ్ లల్లాలో నుదుటిని తాకిన సూర్యకిరణాలు

Ram Lalla Tilak: అయోధ్యలోని రామ్ లల్లాలో నుదుటిని తాకిన సూర్యకిరణాలు

వ్రాసిన వారు Stalin
Apr 17, 2024
02:58 pm

ఈ వార్తాకథనం ఏంటి

అయోధ్య (Ayodhya)లోని రామ్ లల్లా (Ram Lalla) లోని అద్భుతం ఆవిష్కృతమైంది. శ్రీ సీతారామచంద్రమూర్తి నుదుటన సూర్యభగవానుడి కిరణాలు తాకాయి. అయోధ్యలో ప్రాణ ప్రతిష్ట తర్వాత తొలిసారి శ్రీరామ నవమి (Sri Rama Navami) వేడుకలు ఘనంగా నిర్వహించారు. శ్రీరామ నవమి వేడుక సందర్భంగా బుధవారం మధ్యాహ్నం 12.01 నిమిషాలకు సూర్యకిరణాలు రామ్ లాల్లాను ముద్దాడాయి. సుమారు రెండున్నర నిమిషాలు పాటు సాగిన ఈ అద్భుత దృశ్యాన్ని భక్తులు వీక్షించారు. దీనికి సంబంధించిన వీడియోలను కూడా విడుదల చేసి సోషల్మీడియాలో వైరల్ చేశారు. రామ్ లాల్లా నుదుటన సుమారు 58 మిల్లీ మీటర్ల సైజులో సూర్య తిలక్ రెండున్నర నిమిషాలు సేపు నిలిచింది.

Sri Rama navami-Surya Tilak

రూర్కీలోని ఐఐటీ శాస్త్రవేత్తలు రూపొందించిన మెకానిజం... 

అయోధ్యలోని 100కు పైగా ఏర్పాటు చేసిన ఎల్ ఈ డీ స్క్రీన్లలో ఈ అరుదైన దృశ్యాన్ని భక్తులు తిలకించి పరవశించిపోయారు. ఆలయంలో ఎలాబ్రేటేడ్ మెకానిజం ద్వారా ఏర్పాటు చేసిన అద్దాలు, కటకాల ద్వారా సూర్యకాంతిని ఒడిసిపట్టి రామ్ లల్లా నుదుటన తాకేలా చేశారు. ఈ మెకానిజాన్ని రూర్కీలోని ఇండియన్ ఇన్ స్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీ శాస్త్రవేత్తలు, ఇండియన్ ఇన్ స్టిట్యూట్ ఆఫ్ ఆస్ట్రో ఫిజిక్స్ వారితో కలసి రూపొందించారు. ఈ అరుదైన దృశ్యం ప్రతీ యేటా వచ్చే శ్రీరామ నవమి సందర్భంగా భక్తులకు కనువిందు చేసేలా ఈ మెకానిజాన్ని ఏర్పాటు చేశారు. అసోం లో ఎన్నికల ప్రచారాన్ని నిర్వహిస్తున్న ప్రధాని మోదీ(Narendra Modi)శ్రీరామనవమి వేడుకల సందర్భంగా జైశ్రీరామ్ ను నినదిస్తూ శుభాకాంక్షలు తెలిపారు.