Page Loader
తెలంగాణ సీఎస్‌: రామకృష్ణారావు వైపే కేసీఆర్ మొగ్గు!
సీఎస్‌గా రామకృష్ణారావు పేరు ఖరారు?

తెలంగాణ సీఎస్‌: రామకృష్ణారావు వైపే కేసీఆర్ మొగ్గు!

వ్రాసిన వారు Stalin
Jan 11, 2023
02:08 pm

ఈ వార్తాకథనం ఏంటి

తెలంగాణ కొత్త చీఫ్ సెక్రటరీ ప్రక్రియ తుది దశకు వచ్చినట్లు తెలుస్తోంది. సీనియర్ ఐఏఎస్ అధికారులు రామకృష్ణారావు, అరవింద్ కుమార్, శాంత కుమారిలో ఒకరు సీఎస్‌గా నియామకం అయ్యే అవకాశం ఉందని మొదటి నుంచి ప్రచారం జరుగుతోంది. ఈ ముగ్గురిలో రామకృష్ణారావు ఎంపికకే కేసీఆర్ మొగ్గు చూపినట్లు సమాచారం. తెలంగాణ సీఎస్‌గా పని చేస్తున్న సోమేష్ కుమార్‌ క్యాడర్ కేటాయింపును హైకోర్టు రద్దు చేసింది. సోమేష్‌కుమార్‌ ఏపీ క్యాడర్‌ కి వెళ్లాలని ఆదేశాలు‌ ఇచ్చింది. ఈ‌ సందర్భంగా కేంద్ర పరిపాలన ట్రిబ్యునల్ ఉత్తర్వులను తెలంగాణ హైకోర్టు కొట్టివేసింది. ఈ క్రమంలో తెలంగాణకు కొత్త సీఎస్ ఎంపిక అనివార్యమైంది.

సీఎస్

సోమేష్ కుమార్ వీఆర్ఎస్?

ఈ ఏడాది డిసెంబర్‌లో సోమేష్ కుమార్ పదవీ విరమణ చేయనున్నారు. ఈ క్రమంలో ఏపీకి వెళ్లడానికి ఆయన ఆసక్తి చూపడం లేదని సమాచారం. అందుకే ఆయన వీఆర్ఎస్ తీసుకునే అవకాశం ఉందనే ప్రచారం జరుగుతోంది. సోమేష్ కుమార్ ఒక వేళ వీఆర్ఎస్ తీసుుకుంటే.. ఆయన్ను.. ప్రభుత్వ సలహాదారుగా కేసీఆర్ నియమించే అవకాశాలను కూడా కొట్టి పారేయలేమని నిపుణులు చెబుతున్నారు. ఎన్నికల ఏడాదిలో సీఎస్ మార్పు అనేది ప్రభుత్వానికి పెద్ద షాక్ అనే చెప్పాలి. అయితే ఆ ఇబ్బందిని అధిగమించేందుకు అన్ని విధాల ఆలోచించి.. రామకృష్ణారావును సీఎస్ సీఎం ఖరారు చేయనున్నట్లు సమాచారం.