
Air India: ఎయిరిండియా బోయింగ్ 787-8లో బయటికొచ్చిన ర్యాట్.. విమానం అత్యవసర ల్యాండింగ్
ఈ వార్తాకథనం ఏంటి
ఎయిర్ ఇండియా (Air India)కు చెందిన బోయింగ్ 787-8 డ్రీమ్‌లైనర్ విమానం పెద్ద ప్రమాదాన్ని తప్పింది. అమృత్‌సర్ నుంచి బర్మింగ్‌హామ్ చేరుతుండగా, ఫ్లైట్ AI117 ల్యాండింగ్‌కు సిద్ధమవుతున్న సమయంలో, ఎమర్జెన్సీ పరికరంగా పనిచేసే రామ్ ఎయిర్ టర్బైన్ (RAT) బయటకొచ్చింది. శనివారం జరిగిన ఈ ఘటనలో ర్యాట్ ప్రారంభమయ్యినప్పటికీ, విమానం సురక్షితంగా ల్యాండ్ అయింది. ఎయిరిండియా ప్రకటన ప్రకారం, ఫ్లైట్ AI117లో ర్యాట్ పని ప్రారంభమైనప్పటికీ విద్యుత్తు మరియు హైడ్రాలిక్ ప్రమాణాలు సాధారణ స్థితిలోనే ఉన్నాయి. బర్మింగ్‌హామ్-దిల్లీ ఫ్లైట్ రద్దు చేశారు. ప్రత్యామ్నాయ ఏర్పాట్లు చేసినట్లు పేర్కొన్నారు. హాల్‌లోని ర్యాట్ అనేది విమానం రెక్క లేదా ప్రధాన బాడీలో ఉండే చిన్న పరికరం.
Details
ఇంజిన్ లో వైఫల్యం
సాధారణ పరిస్థితుల్లో ఇది విమానంలో ముడుచుకుపోయి ఉంటుంది. కానీ ఇంజిన్ వైఫల్యం, విద్యుదుత్పత్తి నిలిచిపోవడం వంటి అత్యవసర పరిస్థితుల్లో మాత్రమే తెరుచుకుని బయటకు వస్తుంది. ర్యాట్ బయటకు వచ్చిందంటే, విమానం ప్రమాదంలో ఉన్నట్లే విమానానికి ఇంజిన్లు ప్రధాన శక్తి. ఇవే లోహవిహంగాన్ని నడిపిస్తూ, లోపల పరికరాలు, నియంత్రణ వ్యవస్థలు, ఉపకరణాలకు అవసరమైన విద్యుత్తును ఉత్పత్తి చేస్తాయి. ఇంజిన్‌లోని కదిలే భాగం సెంట్రల్ డ్రైవ్ షాఫ్ట్, విద్యుత్ జనరేటర్‌తో అనుసంధానమై, యాంత్రిక శక్తిని విద్యుత్తుగా మార్చి వివిధ పరికరాలకు సరఫరా చేస్తుంది.
Details
విద్యుత్ సరఫరా నిలిపివేత
ప్రయాణ సమయంలో ఇంజిన్లు పనిచేయకపోతే, విద్యుత్తు సరఫరా నిలుస్తుంది. అలాంటి సందర్భంలో విమానాన్ని నియంత్రించడానికి, హైడ్రాలిక్ వ్యవస్థలు, ప్రధాన సాధనాలు ఉపయోగించడానికి RAT పని చేస్తుంది. RAT ద్వారా అత్యవసర విద్యుత్తు ఉత్పత్తి చేసి, ప్రధాన పరికరాలు, నియంత్రణ, కమ్యూనికేషన్ వ్యవస్థలు, విద్యుదీపాలను నడిపించవచ్చు.