LOADING...
Lemon Rate: రికార్డు సృష్టించిన నిమ్మ ధర.. చరిత్రలోనే అత్యధిక ధర నమోదు
రికార్డు సృష్టించిన నిమ్మ ధర.. చరిత్రలోనే అత్యధిక ధర నమోదు

Lemon Rate: రికార్డు సృష్టించిన నిమ్మ ధర.. చరిత్రలోనే అత్యధిక ధర నమోదు

వ్రాసిన వారు Jayachandra Akuri
Apr 04, 2026
10:10 am

ఈ వార్తాకథనం ఏంటి

శ్రీపొట్టిశ్రీరాములు నెల్లూరు జిల్లా పొదలకూరు నిమ్మ మార్కెట్లో శుక్రవారం రికార్డు స్థాయిలో ధరలు నమోదయ్యాయి. 80 కిలోల నిమ్మకాయల బస్తా రూ.10 వేల వరకు పలకడం విశేషం. గత పదేళ్లలో ఇంత అధిక ధర నమోదు కాలేదని రైతులు, వ్యాపారులు చెబుతున్నారు. మార్చి రెండో వారం వరకు గిట్టుబాటు ధరలు లేక రైతులు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొన్నారు. ముఖ్యంగా జిల్లాలోని మెట్ట ప్రాంతాల్లో ఎక్కువ మంది రైతులు నిమ్మ సాగుపైనే ఆధారపడి జీవిస్తున్నారు. అయితే ప్రస్తుతం పరిస్థితి మారి, మార్కెట్లో మంచి డిమాండ్ రావడంతో ధరలు ఒక్కసారిగా పెరిగాయి.

వివరాలు

ఒక్కో నిమ్మకాయ ధర రూ.5

దిల్లీ మార్కెట్‌తో పాటు ఈశాన్య రాష్ట్రాల్లో కూడా డిమాండ్ పెరగడంతో ఒక్క నిమ్మకాయ ధర రూ.5 వరకు చేరింది. నిమ్మ వ్యాపారుల సంఘం కార్యదర్శి ప్రభాకర్‌రెడ్డి మాట్లాడుతూ, పొదలకూరు మార్కెట్ నుంచి ప్రతిరోజూ సుమారు 15 లారీల నిమ్మకాయల సరకు దేశంలోని వివిధ ప్రాంతాలకు తరలిస్తున్నామని తెలిపారు. అయితే దిగుబడులు తక్కువగా ఉండటం కూడా ధరలు పెరగడానికి కారణమని పేర్కొన్నారు.

Advertisement