Revanth Reddy: హైకోర్టులో ఊరట.. సీఎం రేవంత్‌పై నమోదైన కేసు కొట్టివేత
ఈ వార్తాకథనం ఏంటి
తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి (Revanth Reddy)పై నమోదైన కేసును హైకోర్టు కొట్టేసింది.
2020 మార్చిలో జన్వాడలో డ్రోన్ ఎగురవేసిన ఘటనకు సంబంధించి నార్సింగి పోలీస్ స్టేషన్‌లో కేసు నమోదైంది.
అప్పట్లో నార్సింగి పోలీసులు రేవంత్‌రెడ్డిని రిమాండ్‌కు తరలించారు. ఈ కేసును రద్దు చేయాలని ఆయన హైకోర్టులో పిటిషన్ దాఖలు చేశారు.
వాదనల సందర్భంగా జన్వాడ ప్రాంతం నిషిద్ధమైనది కాదని, తప్పుడు సెక్షన్లు నమోదు చేశారని రేవంత్‌రెడ్డి తరఫు న్యాయవాది పేర్కొన్నారు. ఈ వాదనలను పరిగణనలోకి తీసుకున్న హైకోర్టు ఎఫ్‌ఐఆర్‌ను కొట్టివేసింది.
Details
కేటీఆర్‌పై నమోదైన కేసు కొట్టివేత
ఇక మరోవైపు సైఫాబాద్ పోలీస్ స్టేషన్‌లో నమోదైన కేసులో కేటీఆర్ (KTR)కూ ఊరట లభించింది.
ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డిని కించపరిచే విధంగా మాట్లాడారని ఎంపీ అనిల్ ఇచ్చిన ఫిర్యాదు మేరకు సైఫాబాద్ పోలీసులు గతంలో కేసు నమోదు చేశారు.
దీంతో కేసును రద్దు చేయాలని కేటీఆర్ హైకోర్టును ఆశ్రయించారు.
హైకోర్టు తుది తీర్పు
కేసు విచారణ సందర్భంగా, బాధ్యత గల పదవిలో ఉన్న వ్యక్తిగా కేటీఆర్ అనవసర వ్యాఖ్యలు చేశారని ప్రభుత్వ తరఫు న్యాయవాది వాదనలు వినిపించారు.
కేటీఆర్ తరఫు న్యాయవాది మాత్రం రాజకీయ కక్షతో కేసు నమోదైందని పేర్కొన్నారు. ఇరువైపుల వాదనలు విన్న హైకోర్టు ఈ కేసును కూడా కొట్టివేస్తూ తీర్పు వెలువరించింది.
ఈ తీర్పుతో రేవంత్‌రెడ్డి, కేటీఆర్‌లు హైకోర్టులో ఊరట పొందారు.