Restaurant Service Charges: రెస్టారెంట్‌లో సర్వీస్ ఛార్జీ చెల్లిస్తున్నారా..? ఈ నెంబర్‌కు కాల్ చేస్తే తిరిగి మీ అకౌంట్లోకి డబ్బులు..
ఈ వార్తాకథనం ఏంటి
రెస్టారెంట్లు, హోటళ్లకు వెళ్లినప్పుడు భోజనం అనంతరం ఇచ్చే బిల్లులో 'సర్వీస్ ఛార్జీ' పేరుతో అదనపు మొత్తం కనిపించడం సాధారణమే. అయితే ఈ సర్వీస్ ఛార్జీని ప్రతి వినియోగదారుడు తప్పనిసరిగా చెల్లించాలనే నిబంధన లేదు. చాలామందికి ఈ విషయం తెలియకపోవడంతో బిల్లులో ఉన్న మొత్తాన్ని ఎలాంటి అభ్యంతరం లేకుండా చెల్లించి వెళ్లిపోతున్నారు. నిబంధనల ప్రకారం సర్వీస్ ఛార్జీ అనేది పూర్తిగా వినియోగదారుడి స్వచ్ఛంద నిర్ణయం. రెస్టారెంట్ సేవలు నచ్చితే ఇష్టపూర్వకంగా చెల్లించవచ్చు.కానీ కస్టమర్ అనుమతి లేకుండా బిల్లులో సర్వీస్ ఛార్జీని చేర్చి వసూలు చేయడం నిబంధనలకు విరుద్ధం. అయినప్పటికీ కొన్ని రెస్టారెంట్లు తమ విధానం ఇదేనని లేదా వెయిటర్ల కోసం ఈ మొత్తం వసూలు చేస్తున్నామని చెబుతూ కస్టమర్లపై అదనపు భారం మోపుతున్నాయి.
vivaralu
సర్వీస్ ఛార్జీపై కేంద్రం స్పష్టమైన మార్గదర్శకాలు
కొందరు వినియోగదారులు బిల్లులోని సర్వీస్ ఛార్జీని తొలగించాలని కోరినా, కొన్ని చోట్ల అందుకు నిరాకరిస్తున్న ఘటనలు కూడా చోటుచేసుకుంటున్నాయి.
సర్వీస్ ఛార్జీల విషయంలో కేంద్ర ప్రభుత్వం ఇప్పటికే రెస్టారెంట్లు,హోటళ్లు,ఆహార విక్రయ కేంద్రాలకు స్పష్టమైన మార్గదర్శకాలు జారీ చేసింది.
వినియోగదారుల నుంచి బలవంతంగా సర్వీస్ ఛార్జీ వసూలు చేయరాదని ఆదేశించింది.
సేవలపై సంతృప్తి చెందిన కస్టమర్ స్వచ్ఛందంగా చెల్లించిన మొత్తాన్ని మాత్రమే స్వీకరించాలని సూచించింది.
సర్వీస్ ఛార్జీలపై దేశవ్యాప్తంగా వినియోగదారుల నుంచి వరుసగా ఫిర్యాదులు అందుతుండటంతో కేంద్ర వినియోగదారుల పరిరక్షణ అథారిటీ (CCPA) చర్యలు కూడా చేపట్టింది.
ఇటీవల సర్వీస్ ఛార్జీ నిబంధనలను ఉల్లంఘించిన 41 రెస్టారెంట్లపై జరిమానాలు విధించింది.
వివరాలు
ఫిర్యాదు చేయాలంటే ఏం చేయాలి?
అలాగే బలవంతంగా వసూలు చేసిన సర్వీస్ ఛార్జీని బాధిత వినియోగదారులకు తిరిగి చెల్లించేలా చర్యలు తీసుకునే వ్యవస్థను కూడా అందుబాటులో ఉంచింది.
రెస్టారెంట్ బిల్లులో మీ అనుమతి లేకుండా సర్వీస్ ఛార్జీ చేర్చినట్లయితే వెంటనే ఫిర్యాదు చేయవచ్చు.
ఇందుకోసం 1915నంబర్‌కు కాల్ చేసి నేషనల్ కన్స్యూమర్ హెల్ప్‌లైన్(NCH)వద్ద ఫిర్యాదు నమోదు చేయొచ్చు.
అలాగే NCHమొబైల్ యాప్ ద్వారా కూడా ఫిర్యాదు చేసే అవకాశం ఉంది.అదనంగాe-Daakhil పోర్టల్ ద్వారా ఆన్‌లైన్‌లో వినియోగదారుల ఫిర్యాదును నమోదు చేయవచ్చు.
అవసరమైతే CCPAకి ఈ-మెయిల్ ద్వారా కూడా ఫిర్యాదు పంపే వెసులుబాటు ఉంది.
సంబంధిత అధికారులు ఫిర్యాదును పరిశీలించి నిబంధనల మేరకు చర్యలు తీసుకుంటారు.
బలవంతంగా వసూలుచేసిన సర్వీస్ ఛార్జీ తిరిగి పొందేందుకు కూడా ఈ ప్రక్రియ ఉపయోగపడుతుంది.