Marshal Jeetendra Mishra: రిటైర్డ్ ఎయిర్ మార్షల్ జితేంద్ర మిశ్రాకు కీలక బాధ్యత.. అయోధ్య రామ మందిరం కొత్త సీఈఓగా ఎంపిక
ఈ వార్తాకథనం ఏంటి
అయోధ్య రామ మందిరం ట్రస్ట్‌కు తొలి చీఫ్ ఎగ్జిక్యూటివ్ ఆఫీసర్ (CEO)గా రిటైర్డ్ ఎయిర్ మార్షల్ జితేంద్ర మిశ్రా ఎంపికయ్యారు. ఈ పదవి కోసం వచ్చిన 5,000కు పైగా దరఖాస్తులను పరిశీలించిన అనంతరం ఆయనను ఎంపిక చేశారు. భారత వాయుసేనలో పలు కీలక కమాండ్ బాధ్యతలు నిర్వహించిన మిశ్రా.. ఆపరేషన్ సిందూర్ సమయంలో వెస్ట్రన్ కమాండ్ చీఫ్‌గా వ్యవహరించారు.
వివరాలు
సీఈఓగా మిశ్రాకు కీలక బాధ్యతలు..
రామ మందిరం నిర్వహణను మరింత పటిష్టంగా తీర్చిదిద్దడంతో పాటు ఆర్థిక వ్యవహారాల్లో పారదర్శకత, జవాబుదారీతనాన్ని పెంచడం ఆయన ముందున్న ప్రధాన బాధ్యత.
ఈ ఏడాది ప్రారంభంలో విరాళాల చోరీకి సంబంధించిన వివాదం తలెత్తడంతో ఆలయ నిర్వహణ, ఆర్థిక వ్యవహారాలపై చర్చ జరిగింది.
ఈ నేపథ్యంలో కొత్త సీఈఓగా మిశ్రాకు కీలక బాధ్యతలు అప్పగించనున్నారు.
వివరాలు
38 సంవత్సరాలకు పైగా సేవలు..
రిటైర్డ్ ఎయిర్ మార్షల్ జితేంద్ర మిశ్రా 1986 డిసెంబర్‌లో ఫైటర్ పైలట్‌గా భారత వాయుసేనలో చేరారు.
38 సంవత్సరాలకు పైగా సేవలందించిన ఆయన 2026 మేలో వాయుసేన నుంచి పదవీ విరమణ చేశారు.
సుదీర్ఘ కెరీర్‌లో పలు ముఖ్యమైన బాధ్యతలు నిర్వహించారు. మిశ్రా పుణెలోని నేషనల్ డిఫెన్స్ అకాడమీ, బెంగళూరులోని ఎయిర్ ఫోర్స్ టెస్ట్ పైలట్స్ స్కూల్‌లో విద్యాభ్యాసం చేశారు.
అలాగే అమెరికాలోని ఎయిర్ కమాండ్ అండ్ స్టాఫ్ కాలేజ్, బ్రిటన్‌లోని రాయల్ కాలేజ్ ఆఫ్ డిఫెన్స్ స్టడీస్‌లో ఉన్నత శిక్షణ పొందారు.