Page Loader
Lucknow: లక్నోలో రిటైర్డ్ IAS అధికారి దారుణ హత్య 
Lucknow: లక్నోలో రిటైర్డ్ IAS అధికారి దారుణ హత్య

Lucknow: లక్నోలో రిటైర్డ్ IAS అధికారి దారుణ హత్య 

వ్రాసిన వారు Stalin
May 26, 2024
05:35 pm

ఈ వార్తాకథనం ఏంటి

లక్నోలో రిటైర్డ్ IAS అధికారి దేవేందర్ దూబే నివాసంలో దారుణహత్య జరిగింది. దూబే రోజువారీ దిన చర్యలో భాగంగా గోల్ఫ్ ఆడి ఉదయం 7.15 కిఇంటికి వచ్చారు. తన ఇంటి డోర్ తెరిచి వుండటాన్ని గమనించి లోపలికి వెళ్లారు. రక్తపు మడుగులో పడి వున్న తన భార్యను చూసి షాక్ కు గురయ్యారు. పాలు సరఫరా చేసిన వ్యక్తి ఇచ్చిన ప్యాకెట్లు మరిగించకుండా అలానే పడి వున్నాయి. అల్మరా లో దాచి వుంచిన విలువైన ఆభరణాలు చెల్లా చెదురుగా పడి వున్నాయి. దీంతో వెంటనే దేవేందర్ దూబే.. లక్నో పోలీసులకు ఫిర్యాదు చేశారు. వెంటనే స్పందించిన పోలీసులు డాగ్ స్క్వాడ్ బృందాలను పంపారు. మృత దేహాన్ని పోస్ట్ మార్టంకు పంపారు.

Details

నివేదిక వచ్చే వరకు ఆగాల్సిందే 

నివేదిక వచ్చే వరకు హత్యకు గల కారణాలను చెప్పలేమన్నారు పోలీసులు. ఫోర్స్ నిక్ బృందం, సిసిటివి ఫూటేజీ, పోస్ట్ మార్టం నివేదిక వచ్చాక స్పందిస్తామన్నారు లక్నో జాయింట్ పోలీసు కమిషనర్ ఆకాష్ కుల్హరీ. కాగా దేవేందర్ దూబే గతంలో రాయ్ బరేలీ జిల్లా కలెక్టర్ గా పని చేశారు.