NewsBytes Telugu
    English Hindi Tamil
    మరింత
    English Hindi Tamil
    NewsBytes Telugu
    భారతదేశం
    బిజినెస్
    అంతర్జాతీయం
    క్రీడలు
    టెక్నాలజీ
    సినిమా
    ఆటోమొబైల్స్
    లైఫ్-స్టైల్
    కథనాలు

    మమ్మల్ని అనుసరించండి
    • Facebook
    • Twitter
    • Linkedin
    హోమ్ / వార్తలు / భారతదేశం వార్తలు / Telangana : రెవెన్యూ శాఖలో విప్లవాత్మక మార్పులు.. 70 మంది రెవెన్యూ అధికారుల బదిలీ
    తదుపరి వార్తా కథనం
    Telangana : రెవెన్యూ శాఖలో విప్లవాత్మక మార్పులు.. 70 మంది రెవెన్యూ అధికారుల బదిలీ
    రెవెన్యూ శాఖలో విప్లవాత్మక మార్పులు.. 70 మంది రెవెన్యూ అధికారుల బదిలీ

    Telangana : రెవెన్యూ శాఖలో విప్లవాత్మక మార్పులు.. 70 మంది రెవెన్యూ అధికారుల బదిలీ

    వ్రాసిన వారు Jayachandra Akuri
    Oct 28, 2024
    06:13 pm

    ఈ వార్తాకథనం ఏంటి

    తెలంగాణ మంత్రి పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి రెవెన్యూ శాఖలో మార్పులను ప్రారంభించారు. ఆయన పుట్టిన రోజున, 70 మంది డిప్యూటీ కలెక్టర్లు, స్పెషల్ డిప్యూటీ కలెక్టర్లు ఒకే సమయంలో బదిలీ కావడం గమనార్హం.

    ఇటీవల రెవెన్యూ సంఘాలు ప్రమోషన్స్, బదిలీలపై మంత్రిని కలిసి మాట్లాడిన తరువాత, ఈ మార్పులు చేపడుతున్నాయి.

    ఈ బదిలీల ప్రక్రియ చర్చనీయాంశంగా మారింది, ఎందుకంటే పలు అదనపు కలెక్టర్లు, ఆర్డీవోలు, భూ సేకరణ అధికారులు, అలాగే సివిల్ సప్లయిస్ శాఖలో పనిచేసే అధికారులను కూడా బదిలీ చేశారు.

    కొందరు తమ కోరిక మేరకు స్థానాలు పొందలేకపోయినప్పటికీ, మరికొందరు ప్రాధాన్యత కలిగిన డివిజన్లకు అనూహ్యంగా బదిలీ అయ్యారు. ఈ మేరకు పదిమంది ఆర్డీవోలకు పోస్టింగ్స్ లభించాయి.

    Details

    రెవెన్యూ శాఖలో రిపోర్ట్ చేయాలని ఆదేశాలు

    డిప్యూటీ కలెక్టర్లు ఎల్. రమేష్, ఎన్. ఆనంద్ కుమార్, వి. హనుమా నాయక్‌కు ఎలాంటి పోస్టింగ్ ఇవ్వలేదు. వారిని రెవెన్యూ శాఖలో రిపోర్ట్ చేయాలని ఆదేశించారు.

    రెవెన్యూ ప్రిన్సిపల్ సెక్రటరీ నవీన్ మిట్టల్ సోమవారం ఉత్తర్వులు జారీ చేశారు.

    హైడ్రా విస్తరణ, కొత్త ఆర్వోఆర్ చట్టం, భూమాత చట్టం, పెండింగ్ భూ సమస్యల పరిష్కారం, ప్రభుత్వ స్థలాల రక్షణ వంటి అంశాల నేపథ్యంలో ఈ బదిలీలు జరిగాయని సమాచారం.

    భూ పరిపాలనలో అనేక సంస్కరణలు త్వరలో అమలు చేయనున్నట్లు తెలుస్తోంది, వీటన్నింటిని సమర్ధంగా నిర్వహించేందుకు మంత్రి పొంగులేటి అవసరమైన ప్లాట్ ఫారాన్ని ఏర్పాటు చేస్తున్నారు.

    Facebook
    Whatsapp
    Twitter
    Linkedin
    సంబంధిత వార్తలు
    తాజా
    తెలంగాణ
    ఇండియా

    తాజా

    IPL 2025: నేటి నుంచే ఐపీఎల్ పునఃప్రారంభం.. ఆర్సీబీ, కేకేఆర్ మధ్య హోరాహోరీ పోటీ! ఐపీఎల్
    Rains: నేడు ఏపీలో అక్కడక్కడ భారీ వర్షాలు.. వాతావరణ శాఖ హెచ్చరిక ఆంధ్రప్రదేశ్
    Gayatri : ప్రముఖ గాయని కన్నుమూత అస్సాం/అసోం
    Dadasaheb Phalke: ఫాల్కే బయోపిక్‌పై క్లారిటీ.. రాజమౌళి కాదు, ఆమిర్‌ టీమ్‌ మాత్రమే సంప్రదించింది టాలీవుడ్

    తెలంగాణ

    Central Tax Share: కేంద్ర పన్నుల్లో రాష్ట్ర వాటా కింద తెలంగాణకు రూ.3,745 కోట్లు, ఆంధ్రప్రదేశ్‌కు రూ.7,211 కోట్లు ఆంధ్రప్రదేశ్
    Telangana: ఇందిరమ్మ ఇళ్ల కమిటీల ఏర్పాటుపై తెలంగాణ ప్రభుత్వం జీవో జారీ తెలంగాణ లేటెస్ట్ న్యూస్
    Mohammed Siraj: డీఎస్పీగా టీమిండియా క్రికెటర్ బాధ్యతలు స్వీకరణ మహ్మద్ సిరాజ్
    Dasara Liquor Sales: 8 రోజుల్లో రూ.852.38 కోట్ల విలువైన మద్యాన్ని తాగేశారు.. మద్యం అమ్మకాల్లో ఆల్‌టైం రికార్డు ప్రభుత్వం

    ఇండియా

    SBI: ఎస్‌బీఐలో 10,000 కొత్త ఉద్యోగాలు.. మార్చి 2024 లోపు నియామకాలు ఎస్‌బీఐ
    Mohammad Muizzu: ఐదు రోజుల పర్యటనలో భాగంగా ఇవాళ దిల్లీకి చేరుకున్న మాల్దీవుల అధ్యక్షుడు దిల్లీ
    Sonam Wangchuk: లద్దాఖ్‌ భవన్‌లో నిరాహార దీక్షకు దిగిన సోనమ్‌ వాంగ్‌చుక్ దిల్లీ
    Nobel Prize: నోబెల్ బహుమతి.. మీకు తెలియని ఆసక్తికరమైన విషయాలివే!  నోబెల్ బహుమతి
    మా గురించి గోప్యతా విధానం నిబంధనలు & షరతులు మమ్మల్ని సంప్రదించండి నైతిక ప్రవర్తన ఫిర్యాదుల పరిష్కారం వార్తలు న్యూస్ ఆర్కైవ్ టాపిక్స్ ఆర్కైవ్స్
    మమ్మల్ని అనుసరించండి
    Facebook Twitter Linkedin
    All rights reserved © NewsBytes 2025