తదుపరి వార్తా కథనం

Dhavaleswaram: గోదావరిలో పెరుగుతున్న వరద ఉద్ధృతి.. ధవళేశ్వరం వద్ద అధికారులు అప్రమత్తం!
వ్రాసిన వారు
Jayachandra Akuri
Jul 12, 2025
10:11 am
ఈ వార్తాకథనం ఏంటి
తూర్పుగోదావరి జిల్లాలోని రాజమహేంద్రవరం సమీప గోదావరి నదిలో వరద ప్రవాహం తీవ్రంగా పెరుగుతోంది. ప్రస్తుతం ధవళేశ్వరం వద్ద గోదావరి నీటిమట్టం 10 అడుగులకు చేరుకుంది. దీంతో ధవళేశ్వరం బ్యారేజి గేట్లు ఎత్తి, సుమారు 5 లక్షల క్యూసెక్కుల నీటిని సముద్రంలోకి విడుదల చేస్తున్నారు. వరద ఉద్ధృతి ఇంకా పెరిగే అవకాశముందని అధికారులు భావిస్తున్నారు. నదిలో నీటిమట్టం **11.75 అడుగులను దాటితే తొలి ప్రమాద హెచ్చరిక జారీ చేస్తామని స్పష్టం చేశారు. పరిస్థితిని ఎప్పటికప్పుడు పర్యవేక్షిస్తూ అవసరమైన ముందస్తు చర్యలు తీసుకోవాలని విపత్తు నిర్వహణ శాఖ సూచనలు జారీ చేసింది.