
Delhi:'రూ. 2,000 కోట్ల స్కాం': ఆప్‌కి చెందిన మనీష్ సిసోడియా, సత్యేంద్ర జైన్‌లపై కొత్త కేసు
ఈ వార్తాకథనం ఏంటి
ఢిల్లీ లిక్కర్ స్కాంలో ఇప్పటికే విచారణను ఎదుర్కొంటున్న ఆమ్ ఆద్మీ పార్టీ (ఆప్) నేతలు, మాజీ మంత్రులు మనీష్ సిసోడియా, సత్యేందర్ జైన్ ల మెడకు మరో అవినీతి కేసు చుట్టుకుంది.
ఢిల్లీలో ఆప్ పాలనలో నిర్వహించిన పాఠశాలలు, తరగతి గదుల నిర్మాణంలో భారీ కుంభకోణం చోటు చేసుకుందని అవినీతి నిరోధక శాఖ (ఏసీబీ) తీవ్ర ఆరోపణలు చేసింది.
మొత్తం 12 వేల స్కూళ్లు, తరగతి గదుల నిర్మాణం చేపట్టిన ప్రక్రియలో సుమారు రూ.2 వేల కోట్ల మేర అవినీతి జరిగిందని అధికారులు వెల్లడించారు.
ఈ నేపథ్యంలో అప్పటి ఉప ముఖ్యమంత్రి మనీశ్ సిసోడియా, మాజీ పీడబ్ల్యూడీ మంత్రి సత్యేందర్ జైన్‌లపై అధికారికంగా కేసు నమోదు చేశారు.
వివరాలు
12,748 క్లాస్ రూం నిర్మాణాలు
ఏసీబీ వెల్లడించిన వివరాల ప్రకారం, ఆమ్ ఆద్మీ పార్టీ ప్రభుత్వం కాలంలో మనీశ్ సిసోడియా ఉప ముఖ్యమంత్రితో పాటు విద్యాశాఖ బాధ్యతలు చేపట్టారు.
అదే సమయంలో సత్యేందర్ జైన్ ప్రజారంగ వర్క్స్ శాఖ (పీడబ్ల్యూడీ) మంత్రిగా వ్యవహరించారు.
ఆ కాలంలో మొత్తం 12,748 క్లాస్ రూం నిర్మాణాలు చేపట్టినట్లు అధికారులు పేర్కొన్నారు.
ఈ నిర్మాణాలకు కాంట్రాక్టులు పొందిన వారిలో చాలామంది ఆప్ పార్టీకి చెందిన వ్యక్తులేనని ఏసీబీ ఆరోపించింది.
ఇంకా, కాంట్రాక్టులు పొందిన సంస్థలు పనులను నిర్ధేశించిన గడువులో పూర్తిచేయలేకపోయాయని, ఫలితంగా నిర్మాణ వ్యయం ఐదంతుల మేరకు పెరిగిందని పేర్కొన్నారు.
వివరాలు
మనీలాండరింగ్ ఆరోపణల జైలుకి వెళ్లిన సత్యేందర్ జైన్
ఈవిషయంలో కేంద్ర విజిలెన్స్ కమిషన్ (సీవీసీ)కూడా పరిశీలన జరిపి అక్రమాలు జరిగాయని నివేదికను ఇచ్చిందని,అయితే ఆ నివేదికను ఆప్ ప్రభుత్వం సుమారు మూడు సంవత్సరాల పాటు బహిర్గతం చేయకుండా దాచేసిందని ఆరోపిస్తున్నారు.
తరగతి గదుల నిర్మాణ ఖర్చు అసాధారణంగా పెరగడంతో బీజేపీ నేతలు ఇచ్చిన ఫిర్యాదుపై విచారణ ప్రారంభమై ఈఅంశాలు వెలుగులోకి వచ్చాయని సమాచారం.
ఢిల్లీపాలనలో కీలక స్థానాలు చేపట్టిన ఈ ఇద్దరు నేతలు ఇప్పటికే వివిధ అవినీతి కేసుల్లో చట్టపరమైన చర్యలను ఎదుర్కొంటున్నారు.
మద్యంవిధానానికి సంబంధించిన కేసులో మనీశ్ సిసోడియా,మనీలాండరింగ్ ఆరోపణలతో సత్యేందర్ జైన్ అరెస్టయ్యి జైలు శిక్షను అనుభవించారు.
ప్రస్తుతం ఇద్దరూ బెయిల్‌పై బయటకు వచ్చారు.ఈతరుణంలో తాజా స్కూల్ కట్టడాల కుంభకోణం ఆరోపణలతో మరోసారి ఆప్ శిబిరంలో కలవరం ఏర్పడింది.