CM Jagan: ఇంటింటికీ రూ.2500 చొప్పున అందిస్తాం : సీఎం జగన్
మిగ్జామ్ తుఫాన్ కారణంగా దెబ్బతిన్న తిరుపతి, బాపట్ల జిల్లాలో ఏపీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి ఇవాళ పర్యటించారు. ఈ సందర్భంగా తిరుపతి జిల్లా బాలిరెడ్డిపాలెంలో ఆయన మాట్లాడారు. తుఫాన్ ప్రభావిత ప్రాంతాల్లో నష్టపోయిన ప్రాంతాల్లో వాలంటీర్లు, గ్రామ సచివాలయ సిబ్బంది ఇంటింటికి తిరిగి రూ.2500 ఇస్తామని ఆయన హామీ ఇచ్చారు. పంట నష్టపోయిన వారు బాధపడాల్సిన అవసరం లేదని, ప్రతి రైతునూ ఆదుకుంటామని భరోసా ఇచ్చారు. వీలైనంత త్వరా విద్యుత్ సరఫరా సజావుగా జరిగేలా ఏర్పాట్లు చేస్తామన్నారు.
రోడ్లను త్వరితగతిన బాగు చేస్తాం
ముఖ్యంగా పంట నష్టపోయిన రైతులకు 80శాతం సబ్సిడీతో విత్తనాలు సరఫరా చేస్తామన్నారు. ఈ హామీలను వారం రోజుల్లో నెరవేరుస్తామని, జిల్లా కలెక్టర్లు దగ్గరుండి పర్యవేక్షిస్తారని సీఎం జగన్ స్పష్టం చేశారు. రోడ్లను బాగు చేసే కార్యక్రమాలను త్వరితగతిన చేపడుతామని తెలిపారు. ప్రభుత్వం నుంచి ఎవరికైనా సాయం అందకపోతే 1902 నెంబన్ ఫోన్ చేస్తే తన కార్యాలయానికే కాల్ వస్తుందని పేర్కొన్నారు. వైసీపీ ప్రభుత్వం ఏ ఒక్కరికైనా మంచే జరుగుతుంది తప్ప, చెడు మాత్రం జరగదన్నారు.