LOADING...
Telangana: తెలంగాణలో 'రహ వీర్‌' పథకం.. ప్రమాద బాధితులకు సాయం చేస్తే రివార్డు
తెలంగాణలో 'రహ వీర్‌' పథకం.. ప్రమాద బాధితులకు సాయం చేస్తే రివార్డు

Telangana: తెలంగాణలో 'రహ వీర్‌' పథకం.. ప్రమాద బాధితులకు సాయం చేస్తే రివార్డు

వ్రాసిన వారు Sirish Praharaju
Feb 09, 2026
04:02 pm

ఈ వార్తాకథనం ఏంటి

రోడ్డు ప్రమాదాల్లో గాయపడిన వారిని తక్షణమే ఆదుకుని ఆసుపత్రికి తరలించే వారికి కేంద్ర ప్రభుత్వం తీసుకొచ్చిన 'రహ వీర్‌' పథకాన్ని తెలంగాణలో కూడా సమర్థంగా అమలు చేస్తామని రవాణా శాఖ ప్రకటించింది. ప్రమాదం జరిగిన వెంటనే భయపడకుండా ముందుకు వచ్చి బాధితులను ఆసుపత్రికి చేర్చే పౌరులను గౌరవిస్తామని, వారికి రవాణా శాఖ ఆధ్వర్యంలో రూ.25 వేల నగదు బహుమతితో పాటు ప్రశంసా పత్రం అందజేస్తామని స్పష్టం చేసింది. రోడ్డు ప్రమాదాల సమయంలో మరింత మంది సహాయక చర్యలకు ముందుకు రావాలని ఆదివారం విడుదల చేసిన ప్రకటనలో రవాణా శాఖ పిలుపునిచ్చింది.

Advertisement