LOADING...
Mohan Bhagwat: పహల్గామ్ ఉగ్రదాడి నుండి హిందూ ఐక్యత వరకు.. ఆర్‌ఎస్‌ఎస్ శతాబ్ది వేడుకలో మోహన్ భగవత్ ప్రసంగం
ఆర్‌ఎస్‌ఎస్ శతాబ్ది వేడుకలో మోహన్ భగవత్ ప్రసంగం

Mohan Bhagwat: పహల్గామ్ ఉగ్రదాడి నుండి హిందూ ఐక్యత వరకు.. ఆర్‌ఎస్‌ఎస్ శతాబ్ది వేడుకలో మోహన్ భగవత్ ప్రసంగం

వ్రాసిన వారు Sirish Praharaju
Oct 02, 2025
11:15 am

ఈ వార్తాకథనం ఏంటి

పహల్గాం లో జరిగిన ఉగ్రదాడిలో ముష్కరులు భారతీయులని మతం(ధర్మం) ఏమిటని అడిగి కాల్చిచంపారని,ఈ దాడిలో 26 మంది అమాయకులు ప్రాణాలు కోల్పోయారని, అనంతరం దేశవ్యాప్తంగా ఆందోళనలు చెలరేగాయని రాష్ట్రీయ స్వయంసేవక్ సంఘ్ చీఫ్ మోహన్ భగవత్ ఆవేదన వ్యక్తం చేశారు ఈ ఘటన దరిమిలా ప్రభుత్వం,సైన్యం ప్రతిస్పందించి ఉగ్రవాదులకు తగిన బుద్ధి చెప్పిందన్నారు.

వివరాలు 

హిందూ సమాజం దేశ భద్రతకు హామీ

ఆర్‌ఎస్‌ఎస్ శతాబ్ది విజయదశమి వేడుకలలో ప్రసంగిస్తూ మోహన్ భగవత్, నేడు, మన దేశంలో వైవిధ్యం విభజనలకు కారణమవుతోందని, అయినా మనమంతా ఒక్కటేనని, వైవిధ్యం అనేది ఆహారం, జీవన పరిస్థితులకే పరిమితమన్నారు. చట్టాన్ని మన చేతుల్లోకి తీసుకోవడం కాదని, ఇలాంటి అరాచకాలను అడ్డుకోవాల్సిన అవసరం ఉందని ఆయన స్పష్టం చేశారు. ఈ సందర్భంలో ఆయన హిందూ ఐక్యతను ప్రతిపాదిస్తూ, సరిగా వ్యవస్థీకృత హిందూ సమాజం దేశ భద్రతకు హామీగా ఉండగలదని చెప్పారు. గత 100 సంవత్సరాలుగా హిందువులను ఏకైకంగా కట్టిపడే కృషి ఆర్‌ఎస్‌ఎస్ కొనసాగించిందని ఆయన గుర్తుచుచేశారు.

వివరాలు 

మహాకుంభ్‌తో ఐక్యతా తరంగాలు 

మహారాష్ట్రలోని నాగపూర్ లో నిర్వహించిన ఆర్‌ఎస్‌ఎస్ శతాబ్ది విజయదశమి వేడుకల్లో ప్రసంగించిన మోహన్ భగవత్, పహల్గాం దాడి, నక్సలైట్ల సమస్యలను ప్రస్తావించారు. పహల్గాం ఘటనలో సైన్యం తక్షణమే పూర్తి సన్నద్ధతతో స్పందించిందని ఆయన చెప్పారు. ప్రయాగ్‌రాజ్ లో జరిగిన మహాకుంభ్ ఉత్సవాలను సూచిస్తూ, ఇది దేశవ్యాప్తంగా ఐక్యత తరంగాలను కలిగించిందని వ్యాఖ్యానించారు. ఆర్‌ఎస్‌ఎస్ శతాబ్ది ఉత్సవాలకు మాజీ రాష్ట్రపతి రామ్ నాథ్ కోవింద్ ముఖ్య అతిథిగా హాజరయ్యారు.

వివరాలు 

ఆర్‌ఎస్‌ఎస్‌లో కుల వివక్ష లేదు: రామ్ నాథ్ కోవింద్ 

రామ్ నాథ్ కోవింద్ ఈ సందర్భంగా, 1991 సార్వత్రిక ఎన్నికల సమయంలో ఆర్‌ఎస్‌ఎస్,దాని స్వచ్ఛంద సేవకులతో మైత్రి ఏర్పడిందని, ఆర్‌ఎస్‌ఎస్ లో ఎలాంటి కుల వివక్ష లేదని స్పష్టం చేశారు. 2001లో ఎర్రకోట సమీపంలో జరిగిన దళిత సంగం ర్యాలీలో కొంతమంది వాజపేయిని దళిత వ్యతిరేకిగా దుయ్యబట్టారని, అయితే అప్పుడు తాము అంబేద్కరిస్టులమని ఆయన సమాధానం చెప్పారన్నారు. రాష్ట్రపతి పదవిని నిర్వర్తించే కాలంలో ఆయన రాజ్యాంగ విలువలకు, బాబా సాహెబ్ ఆశయాలకు ప్రాధాన్యత ఇచ్చారని పేర్కొన్నారు. ఈ సంవత్సరం ఆర్‌ఎస్‌ఎస్ తన 100వ స్థాపన వార్షికోత్సవాన్ని జరుపుకుంటోంది. దీని క్రమంలో ప్రధాని నరేంద్ర మోదీ ఢిల్లీలో ప్రత్యేక తపాలా బిళ్ల, స్మారక నాణేను విడుదల చేశారు.

వివరాలు 

1925లో విజయదశమి వేళ.. 

నాగపూర్ చేరిన మాజీ రాష్ట్రపతి రామ్ నాథ్ కోవింద్, 1956లో డాక్టర్ బి.ఆర్. అంబేద్కర్ బౌద్ధమతాన్ని స్వీకరించిన దీక్ష స్థలాన్ని సందర్శించారు. ఆ రోజు కేశవ్ బలిరామ్ హెడ్గేవార్ ఆధ్వర్యంలో 17 మంది నేతల సమక్షంలో ఆర్‌ఎస్‌ఎస్ స్థాపన జరిగింది. 1926 ఏప్రిల్ 17న ఆ కార్యక్రమానికి "రాష్ట్రీయ స్వయంసేవక్ సంఘ్" అనే పేరు విధించబడింది. ప్రస్తుతం జరుగుతున్న ఆర్‌ఎస్‌ఎస్ శతాబ్ది ఉత్సవాల్లో 21,000 స్వచ్ఛంద సేవకులు పాల్గొంటున్నారు.

వివరాలు 

విదేశీ అతిథులు హాజరు 

విజయదశమి వేడుకల్లో, ఆర్‌ఎస్‌ఎస్ చీఫ్ మోహన్ భగవత్ ఆయుధ పూజ నిర్వహించారు. ఘనా, ఇండోనేషియా నుండి ప్రత్యేక అతిథులు ఈ ఉత్సవాల్లో హాజరయ్యారు. దక్షిణ భారతీయ సంస్థ డెక్కన్ గ్రూప్ నుండి లెఫ్టినెంట్ జనరల్ రాణా ప్రతాప్ కాలిత్, కేవీ కార్తీక్, బజాజ్ గ్రూప్ నుంచి సంజీవ్ బజాజ్ పాల్గొన్నారు. ఘనా, దక్షిణాఫ్రికా, ఇండోనేషియా, థాయిలాండ్, యూకే, యుఎస్ఎ వంటి దేశాల ప్రతినిధులను ఆర్‌ఎస్‌ఎస్ ఈ వేడుకలకు ఆహ్వానించింది.