Kagita Krishna Prasad: ఎమ్మెల్యే కారును ఢీకొన్న ఆర్టీసీ బస్సు
వ్రాసిన వారు
Jayachandra Akuri
Aug 29, 2026
03:53 pm
ఈ వార్తాకథనం ఏంటి
కృష్ణా జిల్లా పెడన టీడీపీ ఎమ్మెల్యే కాగిత కృష్ణప్రసాద్‌కు త్రుటిలో ప్రమాదం తప్పింది. విజయవాడ నుంచి పెడనకు వెళ్తుండగా గంగూరు వద్ద ఈ ఘటన చోటుచేసుకుంది. ఎమ్మెల్యే ప్రయాణిస్తున్న కారును ఉయ్యూరు డిపోకు చెందిన ఆర్టీసీ బస్సు ఢీకొంది. ఈ ప్రమాదంలో కారు ముందు భాగం ధ్వంసమైంది. అయితే అదృష్టవశాత్తూ ఎమ్మెల్యేతో పాటు ఎవరికి ఎలాంటి గాయాలు కాలేదు. ప్రమాదం అనంతరం ఎమ్మెల్యే కాగిత కృష్ణప్రసాద్ తన నివాసానికి వెళ్లిపోయారు.