
TGRTC: త్వరలో ఆర్టీసీలో 3,038 ఉద్యోగాల భర్తీకి శ్రీకారం.. ఎండీ సజ్జనార్ ప్రకటన
ఈ వార్తాకథనం ఏంటి
తెలంగాణ ఆర్టీసీలో త్వరలోనే 3,038 ఖాళీ పోస్టులను భర్తీ చేయనున్నట్లు సంస్థ వైస్ ఛైర్మన్, ఎండీ వీసీ సజ్జనార్ వెల్లడించారు.
ఈ నియామకాలకు ప్రభుత్వం ఇప్పటికే అనుమతి ఇచ్చిందని తెలిపారు. తాజా నియామకాలతో ఆర్టీసీ కార్మికులు, ఉద్యోగులపై ఉన్న పనిభారం తగ్గుతుందని ఆయన పేర్కొన్నారు.
సోమవారం అంబేడ్కర్ జయంతి సందర్భంగా హైదరాబాద్ బాగ్‌లింగంపల్లిలోని ఆర్టీసీ కళాభవన్‌లో జరిగిన కార్యక్రమంలో ఆయన ముఖ్యఅతిథిగా పాల్గొన్నారు.
Details
ఎస్సీ వర్గీకరణ అమలు చేస్తాం
అంబేడ్కర్ చిత్రపటానికి నివాళులర్పించిన అనంతరం సజ్జనార్ మాట్లాడారు. ఈ కొత్త నియామకాల్లో ఎస్సీ వర్గీకరణను ఖచ్చితంగా అమలు చేస్తామని స్పష్టం చేశారు.
ఉద్యోగులు, సిబ్బంది సంక్షేమమే తమ ప్రాధాన్యతగా యాజమాన్యం కట్టుబడి ఉందన్నారు.
కార్యక్రమంలో ఆర్టీసీ ఎగ్జిక్యూటివ్ డైరెక్టర్లు మునిశేఖర్, రాజశేఖర్, ఖుస్రోషా ఖాన్, వెంకన్న, జాయింట్ డైరెక్టర్లు నర్మద, ఉషాదేవి, రంగారెడ్డి జిల్లా రీజినల్ మేనేజర్ శ్రీలతతో పాటు ఆర్టీసీ ఎస్సీ, ఎస్టీ సంక్షేమ సంఘాల నాయకులు పాల్గొన్నారు.