
Rishikonda Beach: బ్లూఫ్లాగ్ గుర్తింపు సాధించిన రుషికొండ బీచ్.. మంత్రి దుర్గేష్ హర్షం
ఈ వార్తాకథనం ఏంటి
ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర పర్యాటక శాఖ మంత్రి కందుల దుర్గేష్ విశాఖపట్నంలోని రుషికొండ బీచ్‌కు బ్లూఫ్లాగ్ గుర్తింపు పునరుద్ధరణపై హర్షం వ్యక్తం చేశారు.
అసెంబ్లీలో ఇచ్చిన మాటను నిలబెట్టుకున్నామని ఆయన తెలిపారు. రుషికొండ బీచ్ పూర్వ వైభవాన్ని తిరిగి తెచ్చేందుకు కృషి చేసి, బ్లూఫ్లాగ్ హోదా వచ్చేలా చర్యలు చేపట్టామని మంత్రి వెల్లడించారు.
ఈ పునరుద్ధరణ కోసం యుద్ధప్రాతిపదికన చర్యలు తీసుకున్నామని, తక్కువ సమయంలోనే లక్ష్యాన్ని సాధించామని చెప్పారు.
Details
పునరుద్ధరణకు విశేష కృషి చేసిన అధికారులకు ధన్యవాదాలు
పర్యాటక శాఖ అధికారులను సమర్థంగా మార్గదర్శనం చేయడంతోపాటు, విశాఖపట్నం కలెక్టర్ హరేంద్రీ ప్రసాద్, జీవీఎంసీ, వీఎంఆర్డీఏ, పోలీస్, అటవీ శాఖల అధికారుల సహకారంతో ఈ ఘనత సాధించగలిగామని మంత్రి దుర్గేష్ వివరించారు.
బ్లూఫ్లాగ్ సర్టిఫికెట్ పునరుద్ధరణకు విశేష కృషి చేసిన అధికారులందరికీ ఆయన ప్రత్యేకంగా అభినందనలు తెలిపారు.
రుషికొండ బీచ్‌కు బ్లూఫ్లాగ్ హోదా పునరుద్ధరణలో ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు, డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ ప్రోత్సాహం కీలక పాత్ర పోషించారని మంత్రి దుర్గేష్ పేర్కొన్నారు.
ఈ ఇద్దరు నేతలకు తన ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేశారు.
Details
రుషికొండ బీచ్ అభివృద్ధికి మరింత కృషి
భారతదేశంలో బ్లూఫ్లాగ్ హోదా పొందిన తొలి ఎనిమిది బీచ్‌లలో రుషికొండ బీచ్ ఒకటిగా నిలిచిందని మంత్రి తెలిపారు.
ఈ బీచ్ అంతర్జాతీయ ప్రమాణాలకు అనుగుణంగా క్లీన్, సేఫ్, ఎకో-ఫ్రెండ్లీ బీచ్‌గా గుర్తింపు పొందడం విశాఖపట్నం గర్వించదగిన విషయమని అన్నారు.
రుషికొండ బీచ్ అభివృద్ధికి ప్రభుత్వం మరింత కృషి చేసి, ప్రపంచస్థాయిలో మరింత గుర్తింపు తీసుకురావడానికి కట్టుబడి ఉందని మంత్రి దుర్గేష్ స్పష్టం చేశారు.