LOADING...
Yanam: సంక్రాంతి వేడుకలకు సిద్ధమైన ఎస్‌.యానాం బీచ్
సంక్రాంతి వేడుకలకు సిద్ధమైన ఎస్‌.యానాం బీచ్

Yanam: సంక్రాంతి వేడుకలకు సిద్ధమైన ఎస్‌.యానాం బీచ్

వ్రాసిన వారు Sirish Praharaju
Jan 13, 2026
11:23 am

ఈ వార్తాకథనం ఏంటి

డా.బీఆర్‌ అంబేడ్కర్‌ కోనసీమ జిల్లాలోని ఎస్‌.యానాం బీచ్‌ ఈ నెల 14, 15, 16 తేదీల్లో సంక్రాంతి వేడుకలతో కళకళలాడనుంది. ఈ సంబరాలను ఘనంగా నిర్వహించేందుకు ప్రభుత్వం రూ.8 కోట్లతో విస్తృత అభివృద్ధి పనులు చేపట్టింది. సందర్శకులకు ఎలాంటి అసౌకర్యాలు కలగకుండా అన్ని ఏర్పాట్లు చేస్తోంది. ట్రాఫిక్‌ సమస్యలు తలెత్తకుండా రూ.3 కోట్ల వ్యయంతో 3.50 కిలోమీటర్ల పొడవున తొమ్మిది సిమెంటు రహదారులను నిర్మించారు. బీచ్‌కు వచ్చే వందలాది వాహనాలు సులభంగా నిలిపేందుకు రూ.30 లక్షలతో భారీ పార్కింగ్‌ స్థలాన్ని అభివృద్ధి చేశారు.

వివరాలు 

రూ.4 కోట్లతో ఆధునిక ఆడిటోరియం నిర్మాణం

అలాగే ఒకేసారి నాలుగు వేల మంది కూర్చొనే విధంగా రూ.4 కోట్లతో ఆధునిక ఆడిటోరియం నిర్మాణం చేపట్టారు. ఈ పనులు ప్రస్తుతం చివరి దశకు చేరుకున్నాయి. అక్కడే సందర్శకుల కోసం రూ.1.20 కోట్లతో రెస్టారెంట్‌ను కూడా నిర్మించారు. బీచ్‌ పరిసర ప్రాంతం మరింత ఆకర్షణీయంగా కనిపించేలా రెండు కిలోమీటర్ల మేర సోలార్‌ లైట్లు, విద్యుత్‌ దీపాలను ఏర్పాటు చేశారు. దీంతో రాత్రివేళ ఆ ప్రాంతం అంతా వెలుగులతో మిరుమిట్లు గొలుపుతూ ప్రత్యేక ఆకర్షణగా నిలుస్తోంది.

ట్విట్టర్ పోస్ట్ చేయండి

సంక్రాంతి పండగ వేళ ముస్తాబైన యానం

Advertisement