తదుపరి వార్తా కథనం
Sabitha Indrareddy: ఎమ్మెల్యే సబితా ఇంద్రారెడ్డి మానవత్వం.. నెట్టింట వైరల్
వ్రాసిన వారు
Stalin
Dec 19, 2023
06:19 pm
ఈ వార్తాకథనం ఏంటి
మాజీ మంత్రి, మహేశ్వరం ఎమ్మెల్యే సబితా ఇంద్రారెడ్డి తన మంచి మనసును చాటుకున్నారు.
ఆపదలో ఉన్న ఓ వ్యక్తికి చేయూతనందించారు. ఇది ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది.
రంగారెడ్డి జిల్లా రావిర్యాలలోని రేణుక ఎల్లమ్మను మంగళవారం దర్శించుకున్న సబిత తుక్కుగూడ వైపుకు వెళ్తున్నారు.
ఇదే సమయంలో రోడ్డుపై ఓ వ్యక్తి ఫీట్స్ వచ్చి కిందపడ్డాడు. ఇది గమనించిన సబిత తన వాహనాన్ని ఆపారు.
తన సిబ్బంది సాయంతో ఫీట్స్ వచ్చిన వ్యక్తిని మామూలు స్థితికి తీసుకొచ్చారు.
ఆ తర్వాత అతని వివరాలను అడిగి తెలుసుకున్నారు. అనంతరం అతనికి కొంత నగదు సాయం చేసి, ఆటో ఎక్కించి, అతని స్వగ్రామానికి పంపారు.
సబితా ఇంద్రారెడ్డి చేసిన సాయం సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది.
ట్విట్టర్ పోస్ట్ చేయండి
ఫిట్స్ వచ్చిన వ్యక్తితో మాట్లాడుతున్న సబితా ఇంద్రారెడ్డి
And people wonder how does she win elections..... pic.twitter.com/XAULUROjiW
— Karthik Reddy Patlolla (@KarthikIndrAnna) December 19, 2023