Page Loader
Safest city: భారత్‌లో అత్యంత సురక్షితమైన నగరాల్లో హైదరాబాద్ స్థానం ఎంతంటే? 
Safest city: భారత్‌లో అత్యంత సురక్షితమైన నగరాల్లో హైదరాబాద్ స్థానం ఎంతంటే?

Safest city: భారత్‌లో అత్యంత సురక్షితమైన నగరాల్లో హైదరాబాద్ స్థానం ఎంతంటే? 

వ్రాసిన వారు Stalin
Dec 05, 2023
06:48 pm

ఈ వార్తాకథనం ఏంటి

భారతదేశంలో అత్యంత సురక్షితమైన నగరాల జాబితాను 'క్రైమ్ ఇన్ ఇండియా 2022' పేరుతో నేషనల్ క్రైమ్ రికార్డ్స్ బ్యూరో (ఎన్‌సీఆర్‌బీ) వెల్లడించింది. ఇందులో కోల్‌కతా మొదటి స్థానంలో ఉంది. కోల్‌కతా వరుసగా మూడో ఏడాది దేశంలో అత్యంత సురక్షితమైన నగరంగా అవతరించడం గమనార్హం. ఎన్‌సీఆర్‌బీ ప్రకారం, 2022లో కోల్‌కతాలో ప్రతి లక్ష జనాభాలో అతి తక్కువ సంఖ్యలో నేరాలు నమోదయ్యాయి. 2021లో లక్ష మందికి 103.4 చొప్పున నేరాలు నమోదు కాగా.. 2022లో నేరాల సంఖ్య 86.5కి తగ్గింది. ఈ లెక్కల ప్రకారం గతేడాదితో పోలిస్తే నేరాల సంఖ్య తగ్గిందని బెంగాల్ మహిళా శిశు సంక్షేమ శాఖ మంత్రి డాక్టర్ శశి పంజా తెలిపారు.

క్రైమ్

మూడోస్థానంలో హైదరాబాద్

సురక్షితమైన నగరాల్లో కోల్‌కతా తర్వాత రెండో స్థానంలో పుణె, మూడో స్థానంలో హైదరాబాద్ ఉన్నాయి. 2022లో పూణేలో లక్ష మందికి 280.7 చొప్పున, హైదరాబాద్‌లో 299.2 కేసులు నమోదయ్యాయి. 2021 సంవత్సరంలో పూణేలో లక్ష జనాభాకు 256.8, హైదరాబాద్‌లో 259.9 నేరాలు నమోదయ్యాయి. రాష్ట్ర ప్రభుత్వం, కేంద్రం అందించిన కేసుల జాబితా ఆధారంగా ఎన్‌సీఆర్‌బీ ఈ డేటాను తయారు చేసింది. దేశంలోని మొత్తం 19 నగరాల్లోని నేరాలను ఎన్‌సీఆర్‌బీ విశ్లేషించింది. ఈ క్రమంలో కోల్‌కతా వరుసగా మూడోసారి సురక్షితమైన నగరంగా అవతరించడం గమనార్హం. 2022లో దేశంలో మహారాష్ట్రలో ఎక్కువ కేసులు నమోదయ్యాయి. అత్యధికంగా హత్య కేసుల్లో జాబితాలో యూపీ, అత్యాచార కేసుల్లో రాజస్థాన్‌ మొదటి స్థానాల్లో ఉన్నాయి.