Loading...
Telangana: సజ్జనర్‌ బదిలీ.. హైదరాబాద్‌ కొత్త సీపీగా మహేశ్‌ భగవత్
సజ్జనర్‌ బదిలీ.. హైదరాబాద్‌ కొత్త సీపీగా మహేశ్‌ భగవత్

Telangana: సజ్జనర్‌ బదిలీ.. హైదరాబాద్‌ కొత్త సీపీగా మహేశ్‌ భగవత్

వ్రాసిన వారు Sirish Praharaju
Nov 12, 2026
05:26 pm

ఈ వార్తాకథనం ఏంటి

తెలంగాణలో భారీగా ఐపీఎస్‌ అధికారుల బదిలీలు జరిగాయి. రాష్ట్రవ్యాప్తంగా 21 మంది ఐపీఎస్‌ అధికారులను బదిలీ చేస్తూ ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి సంజయ్‌ జాజు గురువారం ఉత్తర్వులు జారీ చేశారు. ఈ బదిలీల్లో భాగంగా హైదరాబాద్‌ పోలీస్‌ కమిషనర్‌ (సీపీ)గా ఉన్న సజ్జనర్‌ను బదిలీ చేశారు. ఆయనకు ఫైర్‌,డిజాస్టర్‌ రెస్పాన్స్‌ డీజీగా బాధ్యతలు అప్పగించారు.అదనంగా స్పెషల్‌ ప్రొటెక్షన్‌ ఫోర్స్‌(ఎస్పీఎఫ్‌)డీజీ బాధ్యతలను కూడా అప్పగించారు. సజ్జనర్‌ స్థానంలో హైదరాబాద్‌ నూతన పోలీస్‌ కమిషనర్‌గా మహేశ్‌ భగవత్‌ను ప్రభుత్వం నియమించింది.

వివరాలు 

జైళ్లశాఖ డీజీగా స్వాతి లక్రా

ఆర్టీసీ వైస్‌ ఛైర్మన్‌,మేనేజింగ్‌ డైరెక్టర్‌గా అనిల్‌ కుమార్‌ను నియమించారు.

జైళ్లశాఖ డీజీగా స్వాతి లక్రా,ఉమెన్‌ సేఫ్టీ వింగ్‌ డీజీగా సౌమ్య మిశ్రాకు బాధ్యతలు అప్పగించారు.

అలాగే పౌరసరఫరాల శాఖ కమిషనర్‌గా నాగిరెడ్డిని,అవినీతి నిరోధక శాఖ (ఏసీబీ) డీజీగా చారు సిన్హాను నియమిస్తూ ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది.

ట్విట్టర్ పోస్ట్ చేయండి

తెలంగాణలో 21 మంది ఐపీఎస్‌ అధికారుల బదిలీ

ADVERTISEMENT