Page Loader
Same sex marriage case: విచారణ బెంచ్ నుంచి సీజేఐ చంద్రచూడ్‌ను తొలగించాలని పిటిషన్; తిరస్కరించిన సుప్రీంకోర్టు 
విచారణ బెంచ్ నుంచి సీజేఐ చంద్రచూడ్‌ను తొలగించాలని పిటిషన్; తిరస్కరించిన సుప్రీంకోర్టు

Same sex marriage case: విచారణ బెంచ్ నుంచి సీజేఐ చంద్రచూడ్‌ను తొలగించాలని పిటిషన్; తిరస్కరించిన సుప్రీంకోర్టు 

వ్రాసిన వారు Stalin
May 10, 2023
04:15 pm

ఈ వార్తాకథనం ఏంటి

స్వలింగ వివాహాలకు చట్టపరమైన గుర్తింపును కోరుతూ దాఖలైన పిటిషన్లను విచారించే బెంచ్ నుంచి భారత ప్రధాన న్యాయమూర్తి డివై చంద్రచూడ్‌ను తొలగించాలని అన్సన్ థామస్ చేసిన దరఖాస్తును సుప్రీంకోర్టు బుధవారం తోసిపుచ్చింది. ప్రధాన న్యాయమూర్తి ఈ విచారణ బెంచ్ నుంచి తప్పుకోవాలని పిటషన్ దారు వాదించగా, సీజేఐ చంద్రచూడ్ వెంటనే స్పందించి దరఖాస్తును తిరస్కరించారు. భారత సొలిసిటర్ జనరల్ తుషార్ మెహతా కూడా ఈ అభ్యర్ధనను వ్యతిరేకించారు. దీన్ని అపరాధంగా పేర్కొన్నారు.

సుప్రీంకోర్టు

స్వలింగ వివాహాలను వ్యతిరేకించిన రాజస్థాన్ ప్రభుత్వం

జస్టిస్‌లు సంజయ్‌ కిషన్‌ కౌల్‌, జస్టిస్‌ ఎస్‌ రవీంద్ర భట్‌, హిమ కోహ్లీ, పీఎస్‌ నరసింహలతో పాటుగా ఈ కేసును విచారిస్తున్న రాజ్యాంగ ధర్మాసనానికి సీజేఐ డీవై చంద్రచూడ్‌ నేతృత్వం వహిస్తున్నారు. బెంచ్ ఏప్రిల్ 18 న విచారణ ప్రారంభించింది. ప్రస్తుతం విచారణ తొమ్మిదో రోజుకు చేరుకుంది. స్వలింగ వివాహాలను రాజస్థాన్ ప్రభుత్వం వ్యతిరేకిస్తున్నట్లు కేంద్రం సుప్రీంకోర్టుకు తెలిపింది. అలాగే మరో ఆరు రాష్ట్రాలు అధ్యయనం చేయడానికి సమయం కోరుతున్నాయని చెప్పారు. వారందరూ ఈ అంశంపై విస్తృత చర్చ అవసరమని చెప్పినట్లు భారత సొలిసిటర్ జనరల్ తుషార్ మెహతా పేర్కొన్నారు.