డివై చంద్రచూడ్: వార్తలు

జ్ఞాన్‌వాపి మసీదులో శివలింగంపై శాస్త్రీయ సర్వేకు బ్రేక్ వేసిన సుప్రీంకోర్టు

వారణాసిలోని మసీదులో 'శివలింగం'గా చెప్పబడుతున్న నిర్మాణ వయస్సును నిర్ధారించడానికి శాస్త్రీయ సర్వే నిర్వహించాలన్న అలహాబాద్ హైకోర్టు ఆదేశాలను సవాలు చేస్తూ దాఖలైన పిటిషన్‌ను సుప్రీంకోర్టు తోసి పుచ్చింది.

Same sex marriage case: విచారణ బెంచ్ నుంచి సీజేఐ చంద్రచూడ్‌ను తొలగించాలని పిటిషన్; తిరస్కరించిన సుప్రీంకోర్టు 

స్వలింగ వివాహాలకు చట్టపరమైన గుర్తింపును కోరుతూ దాఖలైన పిటిషన్లను విచారించే బెంచ్ నుంచి భారత ప్రధాన న్యాయమూర్తి డివై చంద్రచూడ్‌ను తొలగించాలని అన్సన్ థామస్ చేసిన దరఖాస్తును సుప్రీంకోర్టు బుధవారం తోసిపుచ్చింది.

దిల్లీ కోర్టును ఆశ్రయించాలని రెజ్లర్లకు సుప్రీంకోర్టు సూచన

రెజ్లింగ్ ఫెడరేషన్ ఆఫ్ ఇండియా (డబ్ల్యూఎఫ్‌ఐ) చీఫ్ బ్రిజ్ భూషణ్ శరణ్ సింగ్‌పై మహిళా రెజ్లర్లు దాఖలు చేసిన పిటిషన్‌పై సుప్రీంకోర్టు గురువారం విచారణను ముగించింది. నిరసన తెలుపుతున్న రెజ్లర్లు దిగువ కోర్టును ఆశ్రయించాలని సూచించింది.

'స్వలింగ వివాహం అర్బన్ కాన్సెప్ట్ కాదు'; కేంద్రం వాదనలను వ్యతిరేకించిన సుప్రీంకోర్టు

భారతదేశంలో స్వలింగ వివాహాలకు చట్టబద్ధత కల్పించాలని కోరుతూ సుప్రీంకోర్టులో దాఖలైన పిటిషన్లపై బుధవారం కూడా విచారణ వాడీవేడీగా సాగింది.

స్వలింగ వివాహ పిటిషన్లపై సుదీర్ఘంగా సాగిన విచారణ; రేపటికి వాయిదా 

స్వలింగ సంపర్కులకు పెళ్లి చేసుకునే హక్కు ఉందని సీజేఐ జస్టిస్ డివై చంద్రచూడ్ స్పష్టం చేశారు. వారిని ఒటరిగా వదిలేస్తే సరిపోదన్నారు. కానీ వారికి అవసరమైన సామాజిక సంస్థల నిర్మాణం చాలా అనివార్యమని నొక్కి చెప్పారు.

గ్యాంగ్‌స్టర్ అతిక్ సోదరుల హత్యపై ఈనెల 24న సుప్రీంకోర్టులో విచారణ 

పోలీసుల సమక్షంలో గ్యాంగ్‌స్టర్ అతిక్ అహ్మద్ , అష్రఫ్ హత్య జరగడంపై విచారించేందుకు మాజీ సీజేఐ అధ్యక్షతన స్వతంత్ర నిపుణుల కమిటీని ఏర్పాటు చేయాలని కోరుతూ చేసిన పిటిషన్‌ను మంగళవారం సుప్రీంకోర్టు స్వీకరించింది.

'నా అధికారాలతో చెలగాటాలొద్దు'; న్యాయవాదిపై సీజేఐ జస్టిస్ చంద్రచూడ్ అసహనం

తన అధికారాలతో చెలగాటాలాడొద్దని భారత ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ డివై చంద్రచూడ్ మంగళవారం ఒక న్యాయవాది పట్ల తీవ్ర అసహనం వ్యక్తం చేశారు.

బిల్కిస్ బానో కేసు విచారణకు ప్రత్యేక బెంచ్‌ను ఏర్పాటు: సుప్రీంకోర్టు

గుజరాత్ అల్లర్ల సమయంలో అత్యాచారం, హత్య కేసులో 11మంది దోషులను విడుదల చేయడాన్ని సవాలు చేస్తూ బిల్కిస్ బానో దాఖలు చేసిన పిటిషన్‌ను విచారించడానికి ప్రత్యేక బెంచ్‌ను ఏర్పాటు చేయనున్నట్లు సుప్రీంకోర్టు బుధవారం పేర్కొంది.

ఉరిశిక్ష అమలుపై సుప్రీంకోర్టు కీలక వ్యాఖ్యలు; తక్కువ బాధతో మరణశిక్ష అమలు ఎలా? కేంద్రానికి సూచనలు

మరణశిక్షను అమలు చేసే కేసుల విషయంలో సుప్రీంకోర్టు మంగళవారం కీలక వ్యాఖ్యలు చేసింది. మరణశిక్ష అమలులో భాగంగా మెడకు తాడును వేలాడిదీసి ఉరివేయడం క్రూరమైన చర్యగా చెబుతున్నారని సుప్రీంకోర్టు పేర్కొంది.

'దేశ ప్రజలకే వదిలేయండి'; స్వలింగ వివాహంపై కిరణ్ రిజిజు ఆసక్తికర కామెంట్స్

స్వలింగ సంపర్కుల వివాహంపై కేంద్ర న్యాయశాఖ మంత్రి కిరెన్ రిజిజు ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. స్వలింగ వివాహాల విషయం అనేది దేశ ప్రజల విజ్ఞతకే వదిలేయాల్సిన అంశం అని కిరెన్ రిజిజు అన్నారు.

స్వలింగ సంపర్కుల వివాహం: పిటిషన్లను రాజ్యాంగ ధర్మాసనానికి బదిలీ చేసిన సుప్రీంకోర్టు

స్వలింగ సంపర్కుల వివాహానికి చట్టపరమైన గుర్తింపు ఇవ్వాలని కోరుతూ దాఖలైన వివిధ పిటిషన్లను సుప్రీంకోర్టు సోమవారం రాజ్యాంగ ధర్మాసనానికి బదిలీ చేసింది.

22 Feb 2023

శివసేన

శివసేన కేసు: ఈసీ ఉత్తర్వులపై స్టే ఇచ్చేందుకు నిరాకరించిన సుప్రీంకోర్టు

సుప్రీంకోర్టులో మహారాష్ట్ర మాజీ ముఖ్యమంత్రి ఉద్ధవ్ ఠాక్రేకు చుక్కెదురైంది. ముఖ్యమంత్రి ఏక్‌నాథ్ షిండే వర్గానికి శివసేన పేరు, విల్లు-బాణం గుర్తును కేటాయిస్తూ ఎన్నికల సంఘం జారీ చేసిన ఉత్తర్వులపై స్టే ఇచ్చేందుకు సర్వోన్నత న్యాయస్థానం నిరాకరించింది.

హిజాబ్ కోసం సుప్రీంకోర్టును ఆశ్రయించిన కర్ణాటక విద్యార్థినులు; బెంచ్ ఏర్పాటుకు సీజేఐ హామీ

హిజాబ్ ధరించి పరీక్షలకు హాజరు కావడానికి అనుమతించాలని, తమ పిటిషన్‌ను అత్యవసరంగా విచారించాలని కోరుతూ కర్ణాటకకు చెందిన విద్యార్థినుల బృందం బుధవారం సుప్రీంకోర్టును ఆశ్రయించింది.

మద్రాస్ హైకోర్టు జడ్టిగా గౌరీ ప్రమాణం, ఆమెకు వ్యతిరేకంగా దాఖలైన పిటిషన్లను కొట్టేసిన సుప్రీంకోర్టు

మద్రాసు హైకోర్టు అదనపు న్యాయమూర్తిగా ప్రముఖ మహిళా న్యాయవాది లక్ష్మణ చంద్ర విక్టోరియా గౌరీ నియామకాన్ని సవాల్ చేస్తూ దాఖలైన పిటిషన్‌ను మంగళవారం సుప్రీంకోర్టు కొట్టివేసింది.