జ్ఞాన్‌వాపి మసీదులో శివలింగంపై శాస్త్రీయ సర్వేకు బ్రేక్ వేసిన సుప్రీంకోర్టు
వారణాసిలోని మసీదులో 'శివలింగం'గా చెప్పబడుతున్న నిర్మాణ వయస్సును నిర్ధారించడానికి శాస్త్రీయ సర్వే నిర్వహించాలన్న అలహాబాద్ హైకోర్టు ఆదేశాలను సవాలు చేస్తూ దాఖలైన పిటిషన్‌ను సుప్రీంకోర్టు తోసి పుచ్చింది. శాస్త్రీయ సర్వేపై సుప్రీంకోర్టు శుక్రవారం స్టే విధించింది. ఈ విషయంలో అందరం జాగ్రత్తగా నడవాలని భారత ప్రధాన న్యాయమూర్తి డివై చంద్రచూడ్ నేతృత్వంలోని ధర్మాసనం నొక్కి చెప్పింది. నిర్మాణం వయస్సును నిర్ధారించడానికి కార్బన్ డేటింగ్‌తో సహా శాస్త్రీయ సర్వే నిర్వహించాలని మే 12న అలహాబాద్ హైకోర్టు ఆదేశాలను సవాలు చేస్తూ దాఖలైన పిటిషన్‌ను సుప్రీంకోర్టు విచారించింది.
జ్ఞాన్‌వాపి మసీదులో బయటపడ్డ శివలింగం
'శివలింగం'పై శాస్త్రీయ సర్వే, కార్బన్ డేటింగ్ కోసం హైకోర్టు ఇచ్చిన ఆదేశాలకు వ్యతిరేకంగా మసీదు ప్యానెల్ చేసిన పిటిషన్‌పై కేంద్రం, ఉత్తరప్రదేశ్ ప్రభుత్వం, హిందూ పిటిషనర్లకు సుప్రీంకోర్టు నోటీసులు జారీ చేసింది. దీంతో 'శివలింగం'పై శాస్త్రీయ సర్వేను ప్రస్తుతానికి వాయిదా వేయడానికి కేంద్రం, ఉత్తరప్రదేశ్ ప్రభుత్వం రెండూ అంగీకరించాయి. వారణాసిలోని దిగువ కోర్టు ఆదేశాల మేరకు జ్ఞాన్‌వాపి మసీదు సముదాయంలో నిర్వహించిన వీడియో సర్వేలో ఈ ఏడాది ప్రారంభంలో 'శివలింగం' బయటపడింది. మసీదు అధికారులు ఆ శాస్త్రీయ పరిశోధనను వ్యతిరేకించారు.