Supreme Court: 'డిప్యూటీ సీఎం' తొలగింపుపై సుప్రీంకోర్టు కీలక నిర్ణయం
ఉప ముఖ్యమంత్రి పదవిని రద్దు చేయాలంటూ దాఖలైన పిటిషన్‌పై సుప్రీంకోర్టులో సోమవారం విచారణ జరిగింది. ఈ సందర్భంగా చీఫ్ జస్టిస్ డివై చంద్రచూడ్ నేతృత్వంలోని ధర్మాసనం కీలక వ్యాఖ్యలు చేసింది. డిప్యూటీ సీఎం పదవి రాజ్యాంగంలో లేనప్పటికీ, దాని వల్ల నిబంధనలు ఉల్లంఘనలు జరగడం లేదని ధర్మాసనం పేర్కొంది. డిప్యూటీ సీఎం పదవిని తొలగించాలన్న పిల్‌ను కోర్టు తోసిపుచ్చింది. అలాగే డిప్యూటీ సీఎంకు నిర్వచనాన్ని కూడా చీఫ్ జస్టిస్ డీవై చంద్రచూడ్ ధర్మాసనం ఇచ్చింది. డిప్యూటీ సీఎం అంటే ఎమ్మెల్యే, మంత్రి అని వ్యాఖ్యానించింది. అధికార పార్టీలో కీలక నాయకుడిని గౌరవించుకునేందుకు డిప్యూటీ సీఎంగా నియమించుకుంటారని తెలిపారు. చాలా రాష్ట్రాల్లో డిప్యూటీలను నియమించుకునే సంప్రదాయం ఉందన్నారు.