పేపర్ లెస్ దిశగా సుప్రీంకోర్టు; వైఫై సదుపాయం ప్రారంభం
సుప్రీంకోర్టు పేపర్ లెస్‌తో పాటు డిజిటలైజేషన్ దిశగా అడుగులు వేస్తోంది. ఈ నేపథ్యంలో వేసవి సెలవుల తర్వాత సోమవారం ప్రారంభమైన సర్వోన్నత న్యాయస్థానంలో ఉచిత వైఫై సదుపాయం అందుబాటులోకి వచ్చినట్లు భారత ప్రధాన న్యాయమూర్తి డివై చంద్రచూడ్ ప్రకటించారు. సుప్రీంకోర్టులో 1నుంచి 5వ గదుల్లో ఉచిత వై-ఫై సదుపాయం అందుబాటులోకి వచ్చిందని సీజేఐ చెప్పారు. త్వరలో బార్ రూమ్‌లలో కూడా దీనిని ప్రారంభించనున్నట్లు వెల్లడించారు. సుప్రీంకోర్టును డిజిటలైజ్డ్‌గా మార్చేందుకు సీజేఐ ప్రయత్నిస్తున్నారు. అందులో భాగంగానే ఇప్పటికే లైవ్ స్ట్రీమింగ్ ఏర్పాటు చేశారు. ఇప్పుడు మరో ముందడుగు వేశారు. వైఫై సదుపాయం అన్ని కోర్టు గదులు, పరిసర ప్రాంతాలు, బార్ లైబ్రరీ-1,2, లేడీస్ బార్ రూమ్, లాంజ్‌లకు దశలవారీగా విస్తరించబడుతుందని సీజేఐ చెప్పారు.