Page Loader
DY Chandrachud: సీజేఐ జస్టిస్‌ డీవై చంద్రచూడ్‌కు సుప్రీం ధర్మాసనం వీడ్కోలు
సీజేఐ జస్టిస్‌ డీవై చంద్రచూడ్‌కు సుప్రీం ధర్మాసనం వీడ్కోలు

DY Chandrachud: సీజేఐ జస్టిస్‌ డీవై చంద్రచూడ్‌కు సుప్రీం ధర్మాసనం వీడ్కోలు

వ్రాసిన వారు Sirish Praharaju
Nov 08, 2024
04:12 pm

ఈ వార్తాకథనం ఏంటి

భారతదేశ ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ డివై చంద్రచూడ్ నవంబర్ 10న పదవీ విరమణ చేయనున్నారు. శుక్రవారం ఆయనకు చివరి పనిదినం కావడంతో, సుప్రీంకోర్టు ప్రత్యేకంగా వీడ్కోలు కార్యక్రమం నిర్వహించింది. ఈ సందర్భంగా జస్టిస్ చంద్రచూడ్ మాట్లాడుతూ, రేపటి నుంచి సుప్రీం కోర్టు తీర్పులు ఇవ్వలేనన్న మాట వాస్తవమే అయినప్పటికీ తన వృత్తి జీవితంలో పూర్తిగా సంతృప్తి సాధించానని తెలిపారు. ఇక జస్టిస్ డీవై చంద్రచూడ్ తర్వాత సుప్రీం కోర్టు ప్రధాన న్యాయమూర్తిగా జస్టిస్ సంజీవ్ ఖన్నా నియమితులయ్యారు. నవంబర్ 11న ఆయన ప్రమాణస్వీకారం చేయనున్నారు. 2025 మే 13 వరకు జస్టిస్ ఖన్నా సీజేఐ పదవిలో కొనసాగనున్నారు.

ట్విట్టర్ పోస్ట్ చేయండి

సుప్రీం ధర్మాసనం వీడ్కోలు