ఆర్టికల్ 35A జమ్ముకశ్మీర్ ప్రజల ప్రాథమిక హక్కులను తొలగించింది: ప్రధాన న్యాయమూర్తి
భారత రాజ్యాంగంలోని ఆర్టికల్ 35A జమ్ముకశ్మీర్ ప్రజల ప్రాథమిక హక్కులను హరించివేసిందని భారత ప్రధాన న్యాయమూర్తి డివై చంద్రచూడ్ సోమవారం అన్నారు. జమ్ముకశ్మీర్ రాష్ట్రంలోని ఆర్టికల్ 370 రద్దును సవాలు చేస్తూ దాఖలైన పిటిషన్లపై 11వ రోజు విచారణ సందర్భంగా జస్టిస్ చంద్రచూడ్ ఈ వ్యాఖ్యలు చేశారు. ఆర్టికల్ 370 అలాగే 35Aను కేంద్ర ప్రభుత్వం ఆగస్టు2019లో రద్దు చేసింది. ఈరెండు ఆర్టికల్స్ జమ్ముకశ్మీర్ ప్రజలకు విశేష అధికారాలు కల్పించాయి. దింతో వారిని శాశ్వత నివాసులుగా గుర్తించాయి.కానీ అదే సమయంలో రాష్ట్రేతరులకు అక్కడ ఎలాంటి హక్కులు లేకుండా అడ్డుకున్నాయి. భారతదేశంలో ఎక్కడైనా ఉద్యోగాలు చేసే అవకాశం కల్పించే ఆర్టికల్16(1),దేశంలో ఎక్కడైనా సెటిల్ అయ్యే హక్కును కల్పించే ఆర్టికల్19 రెండింటినీ 35A ఆర్టికల్ లాగేసుకుందన్నారు.
గతంలో అమలు చేయని సంక్షేమ పథకాలు ఇది అమలు చేస్తుంది: తుషార్ మెహతా
రాష్ట్ర ప్రభుత్వంలోని అందరికి సమాన అవకాశాలు,ఉద్యోగం,భూమి కొనుగోలు చేసే హక్కును కూడా ఈ ఆర్టికల్ లాగేసుకుందన్న జస్టిస్ వీటిపై జమ్మూకశ్మీర్ పౌరులకు ప్రత్యేక రైట్స్ ఉండడం వల్ల ఇతర రాష్ట్రాలకు ఇవి అందకుండా పోయాయన్నారు. ఈ సందర్భంగా కేంద్రం తరపున వాదనలు వినిపించిన సొలిసిటర్ జనరల్ తుషార్ మెహతా మాట్లాడుతూ.. జమ్మూకశ్మీర్‌కు స్వయం ప్రతిపత్తిని ఎత్తేయడం వల్ల దేశం మొత్తం ఒకే లాగ ఉందన్నారు. జమ్మూకశ్మీర్‌లో అంతకముందు అమలు చేయని సంక్షేమ పథకాలను ఇది అమలు చేస్తుందన్న ఆయన దీనికి ఉదాహరణగా విద్యాహక్కును పేర్కొన్నారు.