
హిజాబ్ కోసం సుప్రీంకోర్టును ఆశ్రయించిన కర్ణాటక విద్యార్థినులు; బెంచ్ ఏర్పాటుకు సీజేఐ హామీ
ఈ వార్తాకథనం ఏంటి
హిజాబ్ ధరించి పరీక్షలకు హాజరు కావడానికి అనుమతించాలని, తమ పిటిషన్‌ను అత్యవసరంగా విచారించాలని కోరుతూ కర్ణాటకకు చెందిన విద్యార్థినుల బృందం బుధవారం సుప్రీంకోర్టును ఆశ్రయించింది.
ఈ నేపథ్యంలో విద్యార్థినుల పిటిషన్‌ను పరిశీలించి బెంచ్ ఏర్పాటు చేస్తామని భారత ప్రధాన న్యాయమూర్తి (సీజేఐ) డీవై చంద్రచూడ్ హామీ ఇచ్చారు.
మార్చి 9న పరీక్షలు ప్రారంభం కానున్నాయని, బాలికలను పరీక్షలకు అనుమతించకపోతే ఒక సంవత్సరం నష్టపోతారని, అత్యవసర జాబితాను కోరుతూ న్యాయవాది షాదన్ ఫరస్ట్ సీజేఐ ఎదుటు ఈ విషయాన్ని ప్రస్తావించారు.
సుప్రంకోర్టు
మధ్యంతర ఉపశమనం కల్పించాలి: పిటిషనర్లు
పరీక్షలు రాకుండా ఎవరు ఆపుతున్నారని ఈ సందర్భంగా సీజేఐ పిటిషనర్లను ప్రశ్నించారు. అమ్మాయిలు తలకు కండువా కప్పుకుంటే పరీక్షలకు అనుమతించట్లేదని న్యాయవాది షాదన్ ఫరస్ట్ కోర్టుకు వివరించారు. అమ్మాయిలు హిజాబ్ లేకుండా పరీక్షలు రాయడానికి సిద్ధంగా లేరని చెప్పారు. తాము మధ్యంతర ఉపశమనం కల్పించాలని కోరుకుంటున్నట్లు సీజేఐకి వివరించారు.
జనవరి 23న, న్యాయవాది మీనాక్షి అరోరా ప్రభుత్వ కళాశాలల్లో నిర్వహించే పరీక్షల ఆవశ్యకతను ప్రస్తావించిన తర్వాత, అత్యవసర జాబితా కోసం చేసిన అభ్యర్థనను పరిగణనలోకి తీసుకోవడానికి సీజేఐ అంగీకరించారు.
ముస్లిం మహిళలు హిజాబ్ ధరించడం ఇస్లాంలో తప్పనిసరి కాదని, యూనిఫాంను అమలు చేసే అధికారం కర్ణాటక ప్రభుత్వానికి ఉందని గతేడాది మార్చిలో హైకోర్టు ఇచ్చిన తీర్పును సవాల్ చేస్తూ పిటిషనర్లు సుప్రీంకోర్టును ఆశ్రయించారు.