NewsBytes Telugu
    English Hindi Tamil
    మరింత
    English Hindi Tamil
    NewsBytes Telugu

    భారతదేశం బిజినెస్ అంతర్జాతీయం క్రీడలు టెక్నాలజీ సినిమా ఆటోమొబైల్స్ లైఫ్-స్టైల్ కథనాలు

    మమ్మల్ని అనుసరించండి
    • Facebook
    • Twitter
    • Linkedin
     
    హోమ్ / వార్తలు / భారతదేశం వార్తలు / 'నా అధికారాలతో చెలగాటాలొద్దు'; న్యాయవాదిపై సీజేఐ జస్టిస్ చంద్రచూడ్ అసహనం
    'నా అధికారాలతో చెలగాటాలొద్దు'; న్యాయవాదిపై సీజేఐ జస్టిస్ చంద్రచూడ్ అసహనం
    భారతదేశం

    'నా అధికారాలతో చెలగాటాలొద్దు'; న్యాయవాదిపై సీజేఐ జస్టిస్ చంద్రచూడ్ అసహనం

    వ్రాసిన వారు Naveen Stalin
    April 11, 2023 | 06:57 pm 0 నిమి చదవండి
    'నా అధికారాలతో చెలగాటాలొద్దు'; న్యాయవాదిపై సీజేఐ జస్టిస్ చంద్రచూడ్ అసహనం
    తన అధికారాలతో చెలగాటాలాడొద్దని ఒక న్యాయవాది పట్ల అసహనం వ్యక్తం చేసిన భారత ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ డివై చంద్రచూడ్

    తన అధికారాలతో చెలగాటాలాడొద్దని భారత ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ డివై చంద్రచూడ్ మంగళవారం ఒక న్యాయవాది పట్ల తీవ్ర అసహనం వ్యక్తం చేశారు. సుప్రీంకోర్టులో న్యాయవాది తన పిటిషన్ ముందస్తు జాబితా కోసం విషయాన్ని ప్రస్తావించారు. అయితే సీజేఐ మాట్లాడుతూ, ఈ పిటిషన్ ఇప్పటికే ఏప్రిల్ 17న విచారణకు జాబితా చేసినట్లు పేర్కొన్నారు. దీంతో న్యాయవాది మరో బెంచ్ ముందు కేసును ప్రస్తావించేందుకు అనుమతి ఇవ్వాలని సీజేఐని కోరారు. దానికి సీజేఐ బదులిస్తూ, ఈ పిటిషన్ విచారణ తేదీ 17అని, 14న తేదీన పిటిషన్‌ను జాబితా చేయాలనుకుంటున్నారా అని న్యాయవాదిని ప్రశ్నించారు. పిటిషన్‌ను సోమవారం కోర్టు విచారించిందని, కొన్ని తాజా విషయాలను కూడా ప్రస్తావించామని న్యాయవాది ధర్మాసనానికి తెలిపారు.

    ఇలాంటి ట్రిక్స్ తనతో ప్లే చేయొద్దు: సీజేఐ

    అనంతరం స్పందించిన సీజేఐ ఈ పిటిషన్ 17వ తేదీకి జాబితా చేయబడిందని, అదే తేదీని విచారణకు వస్తుందని ఖరాఖండిగా చెప్పారు. ఇలా చేసి తన అధికారాలతో చెలగాటం ఆడొద్దన్నారు. ఇలాంటి ట్రిక్స్ తనతో ప్లే చేయొద్దని సీజేఐ గట్టిగా హెచ్చరించారు. గతంలో కూడా సీజేఐకి ఇలాంటి అనుభవమే ఎదురైంది. ఒక న్యాయవాది తన కేసును ఫలానా తేదీని విచారణ చేపట్టాలని పట్టుబట్టగా, ఆగ్రహం వ్యక్తం చేసిన సీజేఐ తనను బెదిరించాలని చూస్తున్నారా? అంటూ ప్రశ్నించారు.

    ఈ టైమ్ లైన్ ని షేర్ చేయండి
    Facebook
    Whatsapp
    Twitter
    Linkedin
    సంబంధిత వార్తలు
    సుప్రీంకోర్టు
    డివై చంద్రచూడ్
    తాజా వార్తలు
    సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తి
    ఇండియా లేటెస్ట్ న్యూస్

    సుప్రీంకోర్టు

    ప్రతిపక్షాలకు ఎదురదెబ్బ; ఈడీ, సీబీఐపై దాఖలు చేసిన పిటిషన్‌ స్వీకరణకు సుప్రీంకోర్టు నిరాకరణ కాంగ్రెస్
    పాటియాలా జైలు నుంచి రేపు విడుదల కానున్న పంజాబ్ కాంగ్రెస్ మాజీ చీఫ్ నవజ్యోత్ సింగ్ సిద్ధూ పంజాబ్
    రూ. 160కోట్ల ఖరీదైన బంగ్లాను కొనుగోలు చేసిన భారత మాజీ అటార్నీ జనరల్ భార్య దిల్లీ
    'అంతా ఏప్రిల్ 30లోగా అయిపోవాలి'; వైఎస్ వివేకా హత్య కేసుపై సుప్రీంకోర్టు ఆదేశాలు కడప

    డివై చంద్రచూడ్

    బిల్కిస్ బానో కేసు విచారణకు ప్రత్యేక బెంచ్‌ను ఏర్పాటు: సుప్రీంకోర్టు సుప్రీంకోర్టు
    ఉరిశిక్ష అమలుపై సుప్రీంకోర్టు కీలక వ్యాఖ్యలు; తక్కువ బాధతో మరణశిక్ష అమలు ఎలా? కేంద్రానికి సూచనలు సుప్రీంకోర్టు
    'దేశ ప్రజలకే వదిలేయండి'; స్వలింగ వివాహంపై కిరణ్ రిజిజు ఆసక్తికర కామెంట్స్ కిరెణ్ రిజిజు
    స్వలింగ సంపర్కుల వివాహం: పిటిషన్లను రాజ్యాంగ ధర్మాసనానికి బదిలీ చేసిన సుప్రీంకోర్టు సుప్రీంకోర్టు

    తాజా వార్తలు

    టీడీపీ కేంద్ర కార్యాలయానికి ఏపీ సీఐడీ నోటీసులు  తెలుగు దేశం పార్టీ/టీడీపీ
    ఎన్నికల వేళ రాజకీయాల నుంచి తప్పుకున్న బీజేపీ సీనియర్ నేత  కర్ణాటక
    బద్దలైన అగ్నిపర్వతం; గ్రామాలను కప్పేసిన బూడిద; ఎగిసిపడుతున్న లావా  రష్యా
    తెలుగు రాష్ట్రాల సంపదను నాశనం చేస్తున్న అదానీ, ప్రధాని: కేటీఆర్ కల్వకుంట్ల తారక రామరావు (కేటీఆర్)

    సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తి

    నేడు మళ్లీ ఈడీ విచారణకు హాజరు కానున్న ఎమ్మెల్సీ కవిత కల్వకుంట్ల కవిత
    హిండెన్‌బర్గ్ వివాదంపై సుప్రీంకోర్టు ఆదేశాన్ని స్వాగతించిన గౌతమ్ అదానీ అదానీ గ్రూప్
    ఎన్నికల కమిషనర్ల నియామకంపై సుప్రీంకోర్టు కీలక తీర్పు; ప్యానెల్ ఏర్పాటు సుప్రీంకోర్టు
    'హిందుత్వం అంటే జీవన విధానం'; చారిత్రక స్థలాల పేర్లను మార్చాలని దాఖలైన పిటిషన్‌ను కొట్టేసిన సుప్రీంకోర్టు సుప్రీంకోర్టు

    ఇండియా లేటెస్ట్ న్యూస్

    ధూలి కారణంగా మరింత క్షీణిస్తున్న  గాలి నాణ్యత దిల్లీ
    రైతులకు గుడ్ న్యూస్; ఈ ఏడాది సాధారణ వర్షాపాతమే: ఐఎండీ అంచనా ఐఎండీ
    డోక్లామ్ సమీపంలో చైనా భారీ సైనిక నిర్మాణాలు; భారత్ ఆందోళన  చైనా
    అమృత్‌పాల్ సింగ్ ఎక్కడ? ఎలా తప్పించుకున్నాడు? పోలీసులకు చెప్పిన పాపల్‌ప్రీత్ సింగ్!  పంజాబ్
    తదుపరి వార్తా కథనం

    భారతదేశం వార్తలను ఇష్టపడుతున్నారా?

    అప్ డేట్ గా ఉండటానికి సబ్ స్క్రయిబ్ చేయండి.

    India Thumbnail
    మా గురించి గోప్యతా విధానం నిబంధనలు & షరతులు మమ్మల్ని సంప్రదించండి నైతిక ప్రవర్తన ఫిర్యాదుల పరిష్కారం వార్తలు న్యూస్ ఆర్కైవ్ టాపిక్స్ ఆర్కైవ్స్
    మమ్మల్ని అనుసరించండి
    Facebook Twitter Linkedin
    All rights reserved © NewsBytes 2023