Page Loader
బిల్కిస్ బానో కేసు విచారణకు ప్రత్యేక బెంచ్‌ను ఏర్పాటు: సుప్రీంకోర్టు
బిల్కిస్ బానో కేసు విచారణకు ప్రత్యేక బెంచ్‌ను ఏర్పాటుకు అంగీకరించిన సుప్రీంకోర్టు

బిల్కిస్ బానో కేసు విచారణకు ప్రత్యేక బెంచ్‌ను ఏర్పాటు: సుప్రీంకోర్టు

వ్రాసిన వారు Stalin
Mar 22, 2023
03:38 pm

ఈ వార్తాకథనం ఏంటి

గుజరాత్ అల్లర్ల సమయంలో అత్యాచారం, హత్య కేసులో 11మంది దోషులను విడుదల చేయడాన్ని సవాలు చేస్తూ బిల్కిస్ బానో దాఖలు చేసిన పిటిషన్‌ను విచారించడానికి ప్రత్యేక బెంచ్‌ను ఏర్పాటు చేయనున్నట్లు సుప్రీంకోర్టు బుధవారం పేర్కొంది. బానో తరపు న్యాయవాది ఈ కేసును అత్యవసరంగా లిస్టింగ్ చేయవలసిందిగా ధర్మానసం ఎదుట ప్రస్తావించారు. దీంతో కేసును విచారించడానికి తేదీని కేటాయిస్తామని సీజేఐ డీవై చంద్రచూడ్ నేతృత్వంలోని ధర్మాసనం తెలిపింది. 2002లో బిల్కిస్ బానోపై అత్యాచారం, ఆమె కుటుంబ సభ్యులను హత్య చేసిన నేరాలకు 11మందిని 2008లో దోషులుగా నిర్ధారించారు. దోషులకు కోర్టు జీవిత ఖైదు విధించింది.

గుజరాత్

గుజరాత్ ప్రభుత్వం అఫిడవిట్ దాఖలు

యావజ్జీవ కారాగార శిక్ష పడిన 11మంది ఖైదీలను గుజరాత్ ప్రభుత్వం 1992 రిమిషన్ పాలసీ ప్రకారం 2022 ఆగస్టులో విడుదల చేసింది. దోషులు విడుదలైనప్పటి నుంచి, సుప్రీంకోర్టులో అనేక పిటిషన్లు దాఖలు చేయబడ్డాయి. మొదటి పిటిషన్‌పై 2022 ఆగస్టు 25న మాజీ సీజేఐ ఎన్వీ రమణ నేతృత్వంలోని ధర్మాసనం నోటీసులు జారీ చేసింది. ఈ కేసును జస్టిస్ అజయ్ రస్తోగి నేతృత్వంలోని ధర్మాసనం విచారిస్తోంది. ఈ పిటిషన్లలో గుజరాత్ ప్రభుత్వం అఫిడవిట్ దాఖలు చేసింది. 11 మంది దోషులు సత్ప్రవర్తన, కేంద్ర ప్రభుత్వ ఆమోదంతో 14 సంవత్సరాల శిక్షను పూర్తి చేసిన తర్వాత విడుదల చేసినట్లు గుజరాత్ ప్రభుత్వం వెల్లడించింది.