DY CHANDRACHUD: తారీఖ్ పే తారీఖ్.. వరుస వాయిదాలపై ప్రధాన న్యాయమూర్తి అసహనం
ఈ వార్తాకథనం ఏంటి
సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ డివై చంద్రచూడ్ అసహం వ్యక్తం చేశారు. న్యాయస్థానాల్లో కేసులు వరుసగా వాయిదా పడటంతో వేగంగా పరిష్కరించే ఉద్దేశం నెరవేరదని ఆయన అభిప్రాయపడ్డారు.
ఈ మేరకు కేసులు పదే పదే వాయిదా పడటంపై జస్టిస్ చంద్రచూడ్ అసంతృప్తి వ్యక్తం చేశారు. సెప్టెంబర్, అక్టోబర్ నెలల్లో 3,668 కేసుల్లో వాయిదాలు కోరినట్లు ఆయన వెల్లడించారు.
ఈ క్రమంలోనే బాలీవుడ్ సినిమా దామినిలోని ఓ డైలాగ్ ను ప్రస్తావించారు. 'tareek peh tareek (వాయిదాల మీద వాయిదా) అన్నారు.
ఇవాళ ఒక్కరోజే దాదాపుగా 178 కేసులు వాయిదా వేయాలని డిమాండ్లు వచ్చినట్లు ఆయన పేర్కొన్నారు.
కోర్టులు వాయిదాలు వేసే సంస్థలుగా ఉండాలని కోరుకోవట్లేదన్నారు. ఫలితంగా కేసుల్ని త్వరితగతిన పరిష్కరించాలనే ఉద్దేశం నెరవేరదన్నారు.
details
ఆ న్యాయస్థానాలు మాత్రం పూర్తి స్థాయిలో నడుస్తున్నాయి ; సీజేఐ
బాలీవుడ్ చిత్రం 'దామిని'లో సన్నీడీఓల్ న్యాయవాదిగా నటించారని గుర్తు చేసిన సీజేఐ, అత్యాచార బాధితురాలి తరఫున కేసు వాదిస్తారన్నారు.
నిందితుడి తరఫున న్యాయవాది, నేరస్తుడ్ని కేసు నుంచే తప్పించేందుకు వాయిదాలు కోరతాడన్నారు. ఈ క్రమంలోనే సన్నీ "tareek peh tareek" డైలాగ్ ఉపయోగిస్తాడు.
న్యాయస్థానాల్లో ఖాళీలు, వాటి మూలంగా పెరుగుతున్న పనిభారం వంటివాటితో కేసుల్లో తీర్పులు ఆలస్యమవుతున్నాయన్నారు.
సుప్రీం సహా దిగువ కోర్టుల్లో పోస్టులు ఖాళీగా ఉన్నాయన్న సీజేఐ, మణిపూర్, మేఘాలయ, సిక్కిం, త్రిపుర హైకోర్టులు మాత్రమే పూర్తిస్థాయి సిబ్బందితో సేవలు అందిస్తున్నాయన్నారు.
ఈ గణాంకాలపై మాజీ న్యాయ శాఖ మంత్రి కిరణ్ రిజిజు స్పందించారు. ఇది న్యాయమూర్తి తప్పు కాదని, వ్యవస్థలోని లోపమన్నారు. ఆ లోపాన్ని సరిదిద్దేందుకే ప్రభుత్వం చర్యలు చేపడుతోందన్నారు.