Page Loader
Article 370 రద్దు రాజ్యాంగబద్ధమా? చట్టవిరుద్ధమా? సోమవారం సుప్రీంకోర్టు తీర్పు 
Article 370 రద్దు రాజ్యాంగబద్ధమా? చట్టవిరుద్ధమా? సోమవారం సుప్రీంకోర్టు తీర్పు

Article 370 రద్దు రాజ్యాంగబద్ధమా? చట్టవిరుద్ధమా? సోమవారం సుప్రీంకోర్టు తీర్పు 

వ్రాసిన వారు Stalin
Dec 10, 2023
07:01 pm

ఈ వార్తాకథనం ఏంటి

జమ్ముకశ్మీర్‌కు ప్రత్యేక ప్రతిపత్తిని కల్పించే రాజ్యాంగంలోని ఆర్టికల్ 370ని రద్దు చేయడాన్ని సవాల్ చేస్తూ దాఖలైన పిటిషన్లపై సుప్రీంకోర్టు సోమవారం తీర్పు వెలువరించనుంది. రెండు వారాల పాటు సాగిన విచారణ అనంతరం సెప్టెంబర్ 5న సుప్రీంకోర్టు రాజ్యాంగ ధర్మాసనం తీర్పును రిజర్వ్‌లో ఉంచింది. చీఫ్ జస్టిస్ డీవై చంద్రచూడ్ నేతృత్వంలోని రాజ్యాంగ ధర్మాసనం తీర్పు ఇవ్వనుంది. విచారణ సందర్భంగా ఆర్టికల్-370 రద్దును సమర్థించే కేంద్రం తరపున అటార్నీ జనరల్ ఆర్ వెంకటరమణి, సొలిసిటర్ జనరల్ తుషార్ మెహతా, సీనియర్ న్యాయవాదులు హరీష్ సాల్వే, రాకేష్ ద్వివేది, వి.గిరి వాదనలు వినిపించారు. పిటిషనర్ల తరపున కపిల్ సిబల్, గోపాల్ సుబ్రమణ్యం, రాజీవ్ ధావన్, జాఫర్ షా, దుష్యంత్ దవే తదితర సీనియర్ న్యాయవాదులు వాదించారు.

ఆర్టికల్

ఆర్టికల్ 370 అంటే ఏమిటి? 

ఆర్టికల్ 370 అనేది ఒకప్పటి జమ్ముకశ్మీర్ రాష్ట్రానికి ప్రత్యేక ప్రతిపత్తిని కల్పించే భారత రాజ్యాంగంలోని కీలకమైన నిబంధన. జూలై 1949లో జమ్ముకశ్మీర్ తాత్కాలిక ప్రధాన మంత్రి షేక్ అబ్దుల్లా భారత రాజ్యాంగ సభతో చర్చల సందర్భంగా ఆర్టికల్ 370 నిబంధనను ఆమోదించారు. ఈ ఆర్టికల్ జమ్ముకశ్మీర్‌కు కొంత స్వయంప్రతిపత్తిని ఇచ్చింది. ఆర్టికల్ 370 నిబంధన జమ్ముకశ్మీర్‌కు స్వంత రాజ్యాంగం, ప్రత్యేక జెండా, భారత ప్రభుత్వానికి అధికారాలు కూడా పరిమితంగా ఉంటాయి. ఆగస్టు 5, 2019న ప్రధానమంత్రి నరేంద్ర మోదీ నేతృత్వంలోని కేంద్ర భారత ప్రభుత్వం ఆర్టికల్ 370ని రద్దు చేస్తూ నిర్ణయం తీసుకుంది. జమ్ముకశ్మీర్ రాష్ట్రాన్ని రెండు ప్రత్యేక కేంద్రపాలిత ప్రాంతాలుగా విభజించింది.