Page Loader
ఉదయనిధి స్టాలిన్‌పై చర్యలు తీసుకోవాలని సీజేఐకి ప్రముఖ పౌరులు లేఖ 
ఉదయనిధి స్టాలిన్‌పై చర్యలు తీసుకోవాలని సీజేఐకి ప్రముఖ పౌరులు లేఖ

ఉదయనిధి స్టాలిన్‌పై చర్యలు తీసుకోవాలని సీజేఐకి ప్రముఖ పౌరులు లేఖ 

వ్రాసిన వారు Sirish Praharaju
Sep 05, 2023
03:57 pm

ఈ వార్తాకథనం ఏంటి

ఉదయనిధి స్టాలిన్ సనాతనధర్మం పై చేసిన అనుచిత వ్యాఖ్యలపై రాజకీయ దుమారం చెలరేగిన నేపథ్యంలో,మాజీ అధికారులు,న్యాయమూర్తులు,ఆర్మీ వెటరన్‌లతో సహా 262 మంది ప్రముఖ పౌరుల బృందం మంగళవారం భారత ప్రధాన న్యాయమూర్తి డివై చంద్రచూడ్‌కు లేఖ రాశారు. అభ్యంతకర వ్యాఖ్యలు చేసిన స్టాలిన్.. కనీసం క్షమాపణ చేప్పేందుకు కూడా ఒప్పుకోలేదని వారు ఆరోపించారు. దేశ లౌకిక స్వభావాన్ని కాపాడేలా కఠిన చర్యలు తీసుకోవాల్సిన అవసరముందని,ఈ అంశాల్లో చర్యలు తీసుకోవడంలో గనుక ఆలస్యం చేస్తే అది కోర్టుధిక్కారం కిందకే వస్తుందని ప్రముఖ పౌరుల బృందం రాసిన లేఖలో ప్రధాన న్యాయమూర్తిని కోరారు. తమిళనాడు ప్రభుత్వం స్టాలిన్​పై చర్యలు తీసుకోవడంలో నిర్లక్ష్యం వహిస్తోందని వారు ఆరోపించారు. ఈ సందర్భంగా ఈకేసును సుమోటోగా తీసుకోవాలని వారు కోరారు.

ట్విట్టర్ పోస్ట్ చేయండి

సుప్రీం కోర్టుకు లేఖ రాసిన 262 మంది ప్రముఖ పౌరుల బృందం