Manipur violence: మణిపూర్ హింసపై సుప్రీంకోర్టుకు నివేదికను సమర్పించిన జస్టిస్ మిట్టల్ కమిటీ
మణిపూర్‌లో చెలరేగిన హింసపై జస్టిస్ (రిటైర్డ్) గీతా మిట్టల్ నేతృత్వంలోని త్రిసభ్య కమిటీ సోమవారం నివేదికను సుప్రీంకోర్టుకు సమర్పించింది. ఈ కమిటీ మూడు నివేదికలను సుప్రీంకోర్టుకు సమర్పించిందని సీజేఐ డివై చంద్రచూడ్ నేతృత్వంలోని ధర్మాసనం పేర్కొంది. మణిపూర్‌లో హింస నేపథ్యంలో రాష్ట్రంలో చేపడుతున్న సహాయక చర్యలు, పునరావాసం, పరిహారం, శాంతిభద్రతల పునరుద్ధరణ తీసుకుంటున్న చర్యల పరిశీలనకు సుప్రీంకోర్టు జస్టిస్ (రిటైర్డ్) గీతా మిట్టల్ నేతృత్వంలోని కమిటీని నియమించింది. మణిపూర్ హింసాకాండలో బాధితులు తమ అవసరమైన పత్రాలను పోగొట్టుకున్నారని, వాటిని తిరిగి జారీ చేయాల్సిన అవసరం ఉందని కమిటీ తన నివేదికలో సూచించింది. సుప్రీంకోర్టు ధర్మాసనం శుక్రవారం ఈ విషయంపై చర్చించనున్నది.