Loading...
Andhra Pradesh: రాష్ట్ర ప్రజలకు ఆరోగ్య భరోసా.. డిసెంబర్‌ 10 నుంచి 'సంజీవని' సేవలు
రాష్ట్ర ప్రజలకు ఆరోగ్య భరోసా.. డిసెంబర్‌ 10 నుంచి 'సంజీవని' సేవలు

Andhra Pradesh: రాష్ట్ర ప్రజలకు ఆరోగ్య భరోసా.. డిసెంబర్‌ 10 నుంచి 'సంజీవని' సేవలు

వ్రాసిన వారు Sirish Praharaju
Sep 11, 2026
09:50 am

ఈ వార్తాకథనం ఏంటి

ఆంధ్రప్రదేశ్‌లో ప్రతిష్ఠాత్మకంగా చేపట్టిన 'సంజీవని' కార్యక్రమాన్ని డిసెంబర్‌ 10 నుంచి రాష్ట్రవ్యాప్తంగా ప్రారంభించేందుకు ప్రభుత్వం ఏర్పాట్లు చేస్తోంది. ఈ విషయాన్ని వైద్యారోగ్య శాఖ కార్యదర్శి వీరపాండియన్‌ వెల్లడించారు. రాష్ట్ర సచివాలయంలో గురువారం నిర్వహించిన కలెక్టర్ల సదస్సులో 'సంజీవని'తో పాటు గత కలెక్టర్ల సదస్సులో తీసుకున్న నిర్ణయాల అమలు పురోగతిని ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడుకు అధికారులు వివరించారు. ఈ సందర్భంగా సంజీవని కార్యక్రమం రాష్ట్రవ్యాప్త అమలుకు చేస్తున్న ఏర్పాట్లను వైద్యారోగ్య శాఖ కార్యదర్శి వివరించారు.

వివరాలు 

టెండరు ప్రక్రియ కారణంగా ప్రారంభ గడువు పొడిగింపు 

కార్యక్రమం అమలు కోసం టాటా మెడికల్‌ అండ్‌ డయాగ్నస్టిక్‌ లిమిటెడ్‌ (టాటా ఎండీ)కు వర్క్‌ ఆర్డర్‌ జారీ చేసినట్లు వీరపాండియన్‌ తెలిపారు.

వాస్తవానికి ఈ కార్యక్రమాన్ని జూన్‌ నాటికే ప్రారంభించాలని ప్రభుత్వం లక్ష్యంగా పెట్టుకున్నప్పటికీ, టెండరు ప్రక్రియ కారణంగా ప్రారంభ గడువును పొడిగించాల్సి వచ్చిందని పేర్కొన్నారు.

ఇప్పటికే చిత్తూరు జిల్లా మొత్తం సంజీవని కార్యక్రమం అమల్లో ఉందని అధికారులు తెలిపారు.

అంతేకాకుండా మార్కాపురం జిల్లాలోని కృష్ణంశెట్టిపల్లి, కర్నూలు జిల్లాలోని ఆస్పరి, అల్లూరి సీతారామరాజు జిల్లాలోని గన్నెల పీహెచ్‌సీల పరిధిలోనూ సంజీవని సేవలు ప్రస్తుతం కొనసాగుతున్నాయని వెల్లడించారు.

ప్రస్తుతం కొన్ని ప్రాంతాల్లో అమలు చేస్తున్న ఈ కార్యక్రమాన్ని డిసెంబర్‌ 10 నుంచి రాష్ట్రంలోని అన్ని ప్రాంతాలకు విస్తరించేలా ప్రభుత్వం చర్యలు చేపడుతోంది.

ADVERTISEMENT