NewsBytes Telugu
    English Hindi Tamil
    మరింత
    English Hindi Tamil
    NewsBytes Telugu
    భారతదేశం
    బిజినెస్
    అంతర్జాతీయం
    క్రీడలు
    టెక్నాలజీ
    సినిమా
    ఆటోమొబైల్స్
    లైఫ్-స్టైల్
    కథనాలు

    మమ్మల్ని అనుసరించండి
    • Facebook
    • Twitter
    • Linkedin
    హోమ్ / వార్తలు / భారతదేశం వార్తలు / Uttarpradesh : నక్కతో పోరాడి తమ్ముడిని రక్షించుకున్న అక్క
    తదుపరి వార్తా కథనం
    Uttarpradesh : నక్కతో పోరాడి తమ్ముడిని రక్షించుకున్న అక్క
    Uttarpradesh : నక్కతో పోరాడి తమ్ముడిని రక్షించుకున్న అక్క

    Uttarpradesh : నక్కతో పోరాడి తమ్ముడిని రక్షించుకున్న అక్క

    వ్రాసిన వారు Sirish Praharaju
    Jul 17, 2024
    09:21 am

    ఈ వార్తాకథనం ఏంటి

    లక్నో లోని రహీమాబాద్ ప్రాంతంలోని మావైకల గ్రామంలోమంగళవారం ఉదయం, ఒక సోదరుడు, సోదరి సహా ఆరుగురిపై నక్క దాడి చేసి గాయపరిచింది.

    అందరినీ చికిత్స నిమిత్తం మలిహాబాద్‌ సీహెచ్‌సీకి తరలించారు.

    ప్రదీప్ కూతురు నేహ(11), కుమారుడు హర్ష్(6) ఉదయం ఊరి బయట ఆడుకుంటున్నారని గ్రామస్తులు తెలిపారు.

    హఠాత్తుగా ఒక నక్క హర్షపై దాడి చేసింది.

    నక్క అతన్ని చాలా చోట్ల కొరికి నేలపై పడేలా చేసింది.

    ఇది చూసిన సోదరి నేహా తన సోదరుడిని రక్షించడానికి పరుగెత్తింది.

    నక్క నుండి అతనిని విడిపించడానికి పోరాడింది. నక్క ఆమెపై కూడా దాడి చేసింది.

    శబ్దం విన్న గ్రామానికి చెందిన చాంద్ హసన్ కర్రతో నక్కను వెంబడించడం ప్రారంభించాడు. నక్క అతని చేయి, కాలు కొరికింది.

    వివరాలు 

    తమ్ముడిని రక్షించుకున్న అక్క

    నక్క పరుగెత్తి పొలంలో పని చేస్తున్న మాయాదేవిపై దాడి చేసింది.

    గ్రామస్తులు గుమిగూడి కర్రలతో నక్కను వెంబడించారు. నక్క పరుగెత్తి తోటకు కాపలాగా ఉన్న అశోక్ (27) చేతిని కొరికి పారిపోయింది.

    ఆపై సైకిల్‌పై ఇంటికి తిరిగి వస్తున్న పురాయ్‌పై దాడి చేసింది. గ్రామస్థులు పరుగులు తీసి పూరై ప్రాణాలను కాపాడారు.

    సోదరి నేహా (11) తన తమ్ముడు హర్ష్‌పై నక్క దాడికి భయపడలేదు.

    ఆమె తన సోదరుడిని రక్షించడానికి నక్క వద్దకు చేరుకుంది.

    నక్క నుండి తమ్ముడిని విడిపించింది.

    భయపడకుండా, తన సోదరుడి కోసం తన ప్రాణాలను పణంగా పెట్టింది.

    నేహా ధైర్యాన్ని గ్రామస్తులందరూ అభినందిస్తున్నారు. నేహా ధైర్యం చేసి ఉండకపోతే పెను ప్రమాదం జరిగి ఉండేదని గ్రామస్తులు అంటున్నారు.

    Facebook
    Whatsapp
    Twitter
    Linkedin
    సంబంధిత వార్తలు
    తాజా
    లక్నో
    ఉత్తర్‌ప్రదేశ్

    తాజా

    Pawan Kalyan : పవన్ చేతిలో ఆస్కార్ ట్రోఫీ! కీరవాణితో సరదాగా గడిపిన క్షణాలు వైరల్ పవన్ కళ్యాణ్
    IMD: 4-5 రోజుల్లో రుతుపవనాలు కేరళకు చేరుకునే అవకాశం ఉంది: ఐఎండీ ఐఎండీ
    Vizag Deputy Mayor: జనసేనకు విశాఖలో మరో పదవి.. డిప్యూటీ మేయర్‌గా గోవింద్‌రెడ్డి ఏకగ్రీవ ఎన్నిక విశాఖపట్టణం
    Raashii Khanna: టాలీవుడ్ స్టార్ హీరోయిన్ కు ప్రమాదం.. ముక్కు నుంచి రక్తం.. చేతులకు గాయాలు..  టాలీవుడ్

    లక్నో

    'త్వరలోనే లక్నో పేరు 'లక్ష్మణ్ నగరి'గా మార్పు', యూపీ డిప్యూటీ సీఎం ప్రకటన శ్రీరాముడు
    లక్నో కోర్టులో తూపాకీ కాల్పులు; గ్యాంగ్‌స్టర్ హత్య  భారతదేశం
    లక్నో: 14 ఏళ్ల బాలికపై అత్యాచారం చేసి, సుత్తితో కొట్టి చంపిన యువకుడు  ఉత్తర్‌ప్రదేశ్
    లక్నోలోని బీజేపీ ఎమ్మెల్యే నివాసంలో 24 ఏళ్ల వ్యక్తి ఆత్మహత్య   ఉత్తర్‌ప్రదేశ్

    ఉత్తర్‌ప్రదేశ్

    Supreme Court: యూపీ మదర్సా చట్టాన్ని రద్దు చేస్తూ హైకోర్టు ఉత్తర్వులపై సుప్రీంకోర్టు స్టే  సుప్రీంకోర్టు
    Hema Malini: పొలాల్లో పని చేస్తున్న మహిళా రైతుల వద్దకు హేమమాలిని.. ఏం చేశారంటే..! భారతదేశం
    Rajasthan: ఘోర రోడ్డు ప్రమాదం.. ట్రక్కును ఢీకొనడంతో కారులో మంటలు.. స్పాట్‌లో ఏడుగురు మృతి రాజస్థాన్
    Uttar Pradesh: నిద్రిస్తున్న భర్తపై వేడినీళ్లు పోసి.. టెర్రస్‌పై నుంచి తోసేసిన భార్య  భారతదేశం
    మా గురించి గోప్యతా విధానం నిబంధనలు & షరతులు మమ్మల్ని సంప్రదించండి నైతిక ప్రవర్తన ఫిర్యాదుల పరిష్కారం వార్తలు న్యూస్ ఆర్కైవ్ టాపిక్స్ ఆర్కైవ్స్
    మమ్మల్ని అనుసరించండి
    Facebook Twitter Linkedin
    All rights reserved © NewsBytes 2025