Loading...
Supreme Court: తాత ఆస్తిలో మనవడికి పుట్టుకతోనే హక్కు ఉండదు.. సుప్రీంకోర్టు కీలక తీర్పు
తాత ఆస్తిలో మనవడికి పుట్టుకతోనే హక్కు ఉండదు.. సుప్రీంకోర్టు కీలక తీర్పు

Supreme Court: తాత ఆస్తిలో మనవడికి పుట్టుకతోనే హక్కు ఉండదు.. సుప్రీంకోర్టు కీలక తీర్పు

వ్రాసిన వారు Sirish Praharaju
Nov 12, 2026
08:39 am

ఈ వార్తాకథనం ఏంటి

తాత ఆస్తిపై మనవడికి పుట్టుకతోనే హక్కు ఉండదు.. తండ్రికి వారసత్వంగా వచ్చిన ఆస్తిని ఆయన తన ఇష్టప్రకారం అమ్ముకోవచ్చని సుప్రీంకోర్టు స్పష్టం చేసింది. తండ్రి వాటా ఆస్తిపై కొడుకులు,మనవళ్లు హక్కు కోరలేరని కీలక తీర్పు వెలువరించింది. చెన్నైకి చెందిన ఓ వ్యక్తి 1997లో తన తాత ఆస్తిలో తనకు కూడా సగం వాటా కావాలని కోర్టును ఆశ్రయించాడు. తాత ఆస్తి పంపకాల ద్వారా తన తండ్రికి వచ్చిన భూమిని ఆయన ఇతరులకు విక్రయించడాన్ని సవాలు చేశాడు. అయితే ఈ కేసును విచారించిన సుప్రీంకోర్టు ధర్మాసనం అతడి అప్పీల్‌ను కొట్టివేసింది. తండ్రికి వారసత్వంగా వచ్చిన ఆస్తిపై ఆయనకే పూర్తి హక్కులు ఉంటాయని, దాన్ని తన ఇష్టానుసారం విక్రయించుకునే అధికారం కూడా ఉంటుందని స్పష్టం చేసింది.

వివరాలు 

తండ్రికి వచ్చిన వాటా.. వ్యక్తిగత ఆస్తే

తండ్రి ఆస్తిని అమ్మకుండా కొడుకులు లేదా మనవళ్లు అడ్డుకోలేరని తేల్చిచెప్పింది.

తాత మరణించిన తర్వాత ఆయన ఆస్తి 1956 నాటి హిందూ వారసత్వ చట్టంలోని సెక్షన్ 8 ప్రకారం ప్రాథమిక వారసులైన క్లాస్-1వారసులకు చెందుతుంది.

ఇందులో కొడుకులు,కూతుళ్లు తదితర చట్టబద్ధమైన వారసులు ఉంటారు.

ఈనిబంధన ప్రకారం ఆస్తిని పంచుకున్నప్పుడు తండ్రికి వచ్చిన భూమి లేదా ఇల్లు ఆయన వ్యక్తిగత ఆస్తిగా మారుతుంది.

దానిపై ఆయన కుమారులకు,మనవళ్లకు పుట్టుకతోనే ఎలాంటి హక్కు ఉండదు.

తండ్రి జీవించి ఉన్నంతకాలం తన వాటాగా వచ్చిన ఆస్తిపై పూర్తి అధికారం ఆయనకే ఉంటుందని న్యాయస్థానం స్పష్టం చేసింది.

ఆస్తిపంపకాలు చట్టబద్ధంగా పూర్తయిన తర్వాత ఉమ్మడికుటుంబ ఆస్తి వ్యవస్థ ముగుస్తుందని, ఎవరి వాటా వారికి వ్యక్తిగత ఆస్తిగా మారుతుందని పేర్కొంది.

ADVERTISEMENT