Loading...
ZPTC and MPTC Election Results: జడ్పీటీసీ, ఎంపీటీసీ ఎన్నికల తుది ఫలితాలు విడుదల
జడ్పీటీసీ, ఎంపీటీసీ ఎన్నికల తుది ఫలితాలు విడుదల

ZPTC and MPTC Election Results: జడ్పీటీసీ, ఎంపీటీసీ ఎన్నికల తుది ఫలితాలు విడుదల

వ్రాసిన వారు Sirish Praharaju
Nov 09, 2026
08:38 am

ఈ వార్తాకథనం ఏంటి

జడ్పీటీసీ, ఎంపీటీసీ ఎన్నికల తుది ఫలితాలను రాష్ట్ర ఎన్నికల సంఘం అధికారికంగా ప్రకటించింది. శనివారం జరిగిన ఓట్ల లెక్కింపులో వివిధ పార్టీలకు వచ్చిన స్థానాల వివరాలను వెల్లడించింది. జడ్పీటీసీ స్థానాల్లో పార్టీల వారీగా ఫలితాలు ఆంధ్రప్రదేశ్ వ్యాప్తంగా మొత్తం 582 జడ్పీటీసీ స్థానాలకు పోలింగ్‌ నిర్వహించారు. ఓట్ల లెక్కింపు అనంతరం తెలుగుదేశం పార్టీ 406 స్థానాల్లో విజయం సాధించింది. వైఎస్సార్‌ కాంగ్రెస్‌ పార్టీ (వైకాపా) 76, జనసేన 73, భారతీయ జనతా పార్టీ (భాజపా) 20 స్థానాలను గెలుచుకున్నాయి. మరో ఆరు స్థానాల్లో స్వతంత్ర అభ్యర్థులు విజయం సాధించగా.. సీపీఐ(ఎం) ఒక స్థానాన్ని దక్కించుకుంది.

వివరాలు 

ఎంపీటీసీ స్థానాల్లోనూ ఫలితాల వెల్లడి

మొత్తం 7,768 ఎంపీటీసీ స్థానాలకు ఎన్నికలు నిర్వహించారు. వీటిలో తెలుగుదేశం పార్టీ 4,806 స్థానాల్లో గెలుపొందింది.

వైకాపా 1,711, జనసేన 938, భాజపా 117 స్థానాలను కైవసం చేసుకున్నాయి. స్వతంత్ర అభ్యర్థులు 169 స్థానాల్లో విజయం సాధించారు.

కాంగ్రెస్‌ పార్టీ 9, సీపీఐ(ఎం) 15, బహుజన్‌ సమాజ్‌ పార్టీ (బీఎస్పీ) 3 స్థానాల్లో గెలుపొందినట్లు రాష్ట్ర ఎన్నికల సంఘం ప్రకటించింది.

ADVERTISEMENT