NewsBytes Telugu
    English Hindi Tamil
    మరింత
    English Hindi Tamil
    NewsBytes Telugu
    భారతదేశం
    బిజినెస్
    అంతర్జాతీయం
    క్రీడలు
    టెక్నాలజీ
    సినిమా
    ఆటోమొబైల్స్
    లైఫ్-స్టైల్
    కథనాలు

    మమ్మల్ని అనుసరించండి
    • Facebook
    • Twitter
    • Linkedin
    హోమ్ / వార్తలు / భారతదేశం వార్తలు / సీమా హైదర్ పొలిటికల్ ఎంట్రీ.. ఆ రాజకీయ పార్టీ బంఫర్ ఆఫర్! 
    తదుపరి వార్తా కథనం
    సీమా హైదర్ పొలిటికల్ ఎంట్రీ.. ఆ రాజకీయ పార్టీ బంఫర్ ఆఫర్! 
    సీమా హైదర్ పొలిటికల్ ఎంట్రీ.. ఆ రాజకీయ పార్టీ బంఫర్ ఆఫర్!

    సీమా హైదర్ పొలిటికల్ ఎంట్రీ.. ఆ రాజకీయ పార్టీ బంఫర్ ఆఫర్! 

    వ్రాసిన వారు Jayachandra Akuri
    Aug 04, 2023
    01:22 pm

    ఈ వార్తాకథనం ఏంటి

    పబ్‌జీ గేమ్‌తో ప్రేమలో పడిన పాక్ మహిళ సీమా గులాం హైదర్ భారత్ కు అక్రమంగా వచ్చిన విషయం తెలిసిందే. ప్రస్తుతం ఆమెకు వరుస ఆఫర్లు వస్తున్నాయి.

    ఇప్పటికే ఓ సినిమాలో 'రా' ఆఫీసర్‌గా నటించడానికి ఆమెకు ఆఫర్ కూడా చేశారు.

    తాజాగా ఓ రాజకీయ పార్టీ సీమాకు 2024 ఎన్నికల్లో పోటీ చేసేందుకు టికెట్ ఇస్తామని వెల్లడించింది.

    భద్రతా సంస్థలు సీమా హైదర్ కు క్లీన్ చిట్ ఇస్తే ఆమె ఎంపీ టికెట్ ఇస్తామని రిపబ్లికన్ పార్టీ ఆఫ్ ఇండియా(అఠావలె) ఆఫర్ చేసింది. ఈ ఆఫర్ ను సీమ్ అంగీకరించినట్లు సమాచారం.

    ఈ మేరకు రిపబ్లికన్ పార్టీ ఉపాధ్యక్షుడు ముఖన్ కిషోర్ ఓ వీడియోను విడుదల చేశారు.

    Details

    సీమాకు అధికార ప్రతినిధి పదవి ఇచ్చేందుకు సిద్ధం

    సీమా అద్భుతమైన వక్త అని, ఆమెకు తమ పార్టీలో అధికార ప్రతినిధి పదవి కూడా ఇచ్చే ఛాన్స్ ఉందని కిషోర్ పేర్కొన్నారు.

    సీమ కేసును పోలీసులు, కేంద్ర సంస్థలు దర్యాప్తు చేస్తున్నాయని, ఇప్పటివరకూ ఆమెకు వ్యతిరేకంగా ఎలాంటి ఆధారాలు లభించలేదని, ఆమెను తమ పార్టీలో చేర్చుకోవాలని అనుకుంటున్నామని కిషోర్ తెలిపారు.

    పాకిస్థాన్ కు చెందిన సీమా, పబ్జీ గేమ్ ఆడుతున్నప్పుడు గ్రేటర్ నోయిడాలోని రబూపురా నివాసి సచిన్ మీనాతో పరిచయం ఏర్పడింది.

    అనంతరం ఆమె నేపాల్ నుంచి అక్రమంగా భారత్ లోకి ప్రవేశించి గ్రేటర్ నోయిడాలోని రబుపురాకు చేరుకుంది. తమ పరిచయం ప్రేమగా మారడంతో, సచిన్ తో కలిసి జీవించడానికి భారత్ కు వచ్చానని అప్పట్లో సీమా పేర్కొంది.

    Facebook
    Whatsapp
    Twitter
    Linkedin
    సంబంధిత వార్తలు
    తాజా
    సీమా గులాం హైదర్
    ఇండియా

    తాజా

    Ashwini Vaishnaw: ఉత్తరప్రదేశ్‌లో ఆరో సెమీ కండక్టర్‌ యూనిట్‌ ఏర్పాటుకు కేంద్ర కేబినెట్‌ గ్రీన్‌ సిగ్నల్‌  ఉత్తర్‌ప్రదేశ్
    Mango: ప్రపంచంలోని టాప్ 20 మామిడి వంటకాలలో భారత్‌కు అగ్రస్థానం.. తయారీ విధానం కూడా చాలా సులువు! వేసవి కాలం
    Telangana: రైతులకు తెలంగాణ ప్రభుత్వం గుడ్ న్యూస్.. ఈ నెలాఖరులోగా ఖాతాల్లో నిధులు జమ తెలంగాణ
    Gold Rates: అమెరికా-చైనా వాణిజ్య ఉద్రిక్తతలు తగ్గిన నేపథ్యంలో.. కుప్పకూలిన బంగారం ధర.. తులం రేటు ఎంతంటే ? బంగారం

    సీమా గులాం హైదర్

    సీమా హైదర్ కేసులో సంచలనాలు.. విచారణలో నమ్మలేని విషయాలు భారతదేశం
    సీమా, సచిన్ కేసులో పోలీసుల ట్విస్ట్.. పెళ్లికి సహకరించిన ఇద్దరి అరెస్ట్ పాకిస్థాన్
    Seema Haider: సినిమాలో 'రా' ఆఫీసర్‌గా సీమా హైదర్! సినిమా

    ఇండియా

    INDIA alliance: 'జీతేగా భారత్'- ప్రతిపక్షాల 'ఇండియా' కుటమికి ట్యాగ్‌లైన్ ఇదే  తాజా వార్తలు
    Netflix: వినియోగదారులకు భారీ షాకిచ్చిన నెట్‌ఫ్లిక్స్.. ఇకపై పాస్ వర్డ్ షేరింగ్‌కు నో ఛాన్స్ నెట్ ఫ్లిక్స్
    వెస్టిండీస్‌పై విరాట్ సెంచరీ: విదేశాల్లో తిరుగులేని రికార్డు; ఇప్పటివరకు ఎన్ని సెంచరీలు చేసాడంటే?  విరాట్ కోహ్లీ
    మణిపూర్‌ పరిస్థితిపై ప్రధాని మోదీ మాట్లాడాలని ప్రతిపక్షాలు డిమాండ్: ఈ నెల 24న నిరసన మణిపూర్
    మా గురించి గోప్యతా విధానం నిబంధనలు & షరతులు మమ్మల్ని సంప్రదించండి నైతిక ప్రవర్తన ఫిర్యాదుల పరిష్కారం వార్తలు న్యూస్ ఆర్కైవ్ టాపిక్స్ ఆర్కైవ్స్
    మమ్మల్ని అనుసరించండి
    Facebook Twitter Linkedin
    All rights reserved © NewsBytes 2025