Page Loader
లోకల్ ట్రైన్‌‌లో బాంబు పెట్టామంటూ ముంబై పోలీసులకు ఫోన్ కాల్
లోకల్ ట్రైన్‌‌లో బాంబు పెట్టామంటూ ముంబై పోలీసులకు ఫోన్ కాల్

లోకల్ ట్రైన్‌‌లో బాంబు పెట్టామంటూ ముంబై పోలీసులకు ఫోన్ కాల్

వ్రాసిన వారు Stalin
Aug 06, 2023
01:07 pm

ఈ వార్తాకథనం ఏంటి

ముంబైలోని లోకల్ ట్రైన్‌‌కు బాంబు బెదిరింపు కాల్ వచ్చింది. ట్రైన్‌లో బాంబులు పెట్టినట్లు ముంబై పోలీసులకు ఆదివారం ఉదయం కంట్రోల్ రూమ్‌కి ఈ కాల్ వచ్చింది. దీంతో ముంబై పోలీసులు అప్రమత్తయ్యారు. కాల్ చేసిన వ్యక్తి తాను జుహూలోని విలే పార్లే ప్రాంతం నుంచి కాల్ చేస్తున్నట్లు చెప్పి ఫోన్ కట్ చేసినట్లు పోలీసు వర్గాలు తెలిపాయి. ఆ వ్యక్తి ఫోన్ లొకేషన్‌ను పోలీసులు ట్రేస్ చేయగా, జుహు నుంచి కాల్ చేసినట్లు తేలిందని వెల్లడించారు. అనంతరం అతడిని జుహు పోలీసులు అరెస్టు చేశారు. అతనిపై కేసు నమోదు చేశారు. నిందితుడిని 25 ఏళ్ల అశోక్ శంకర్ ముఖియాగా గుర్తించారు. మద్యం మత్తులో అతడు ఫోన్ చేసినట్లు పోలీసు అధికారులు తెలిపారు.

ట్విట్టర్ పోస్ట్ చేయండి

నిందితుడిని అరెస్టు చేసిన పోలీసులు