తదుపరి వార్తా కథనం
తెలంగాణాలో రానున్న మూడు రోజులలో వర్షాలు
వ్రాసిన వారు
Sirish Praharaju
Aug 25, 2023
12:03 pm
ఈ వార్తాకథనం ఏంటి
తెలంగాణలోని పలు జిల్లాల్లో వచ్చే మూడు రోజుల పాటు తేలిక నుండి మోస్తరు వర్షాలు కురిసే అవకాశం ఉన్నట్లు వాతావరణ శాఖ తెలిపింది.
బంగాళాఖాతంలో అల్పపీడనం కారణంగా ఆసిఫాబాద్, మంచిర్యాల, కరీంనగర్, పెద్దపల్లి, భూపాలపల్లి, ములుగు, కొత్తగూడెం,మహబూబాబాద్,వరంగల్, హన్మకొండ, జనగాం,యాదాద్రి భువనగిరి జిల్లాల్లో ఉరుములు, మెరుపులతో కూడిన మోస్తరు నుంచి భారీ వర్షం కురిసే అవకాశం ఉందని తెలిపింది.
ఈ సందర్భంగా ఆయా జిల్లాలకు ఎల్లో హెచ్చరిక జారీ చేసింది. వేరే ఇతర ప్రాంతాల్లో పొడి వాతావరణం ఉంటుందని అంచనా వేసింది.
ఈ నెల 28 నుంచి సెప్టెంబర్ 2 మధ్య వర్షాలకు స్వల్ప విరామం ఉంటుందని అనంతరం సెప్టెంబర్ 3 తర్వాత రాష్ట్రంలో మళ్లీ వర్షాలు కురిసే అవకాశం ఉందని తెలిపింది.
ట్విట్టర్ పోస్ట్ చేయండి
తెలంగాణలోని పలు జిల్లాలకు ఎల్లో హెచ్చరిక జారీ
— IMD_Metcentrehyd (@metcentrehyd) August 24, 2023