Loading...
Cyclone Arnab: తీరంలోకి దాటుతున్న అర్నబ్‌ తుపాను.. ఈదురుగాలులతో భారీ వర్షాలు
తీరంలోకి దాటుతున్న అర్నబ్‌ తుపాను.. ఈదురుగాలులతో భారీ వర్షాలు

Cyclone Arnab: తీరంలోకి దాటుతున్న అర్నబ్‌ తుపాను.. ఈదురుగాలులతో భారీ వర్షాలు

వ్రాసిన వారు Sirish Praharaju
Oct 28, 2026
08:03 am

ఈ వార్తాకథనం ఏంటి

అతి తీవ్ర తుపాను అర్నబ్‌ తీరాన్ని తాకింది. ఏపీలోని యానాంకు దక్షిణంగా,నరసాపురం సమీపంలో తుపాను భూభాగంలోకి ప్రవేశించింది. ఇది పూర్తిగా తీరం దాటడానికి మరికొంత సమయం పడుతుందని వాతావరణశాఖ అధికారులు వెల్లడించారు. తీరం దాటడానికి ముందు తుపాను గంటకు కేవలం 3కిలోమీటర్ల వేగంతో కదిలినట్లు తెలిపారు. అర్నబ్‌ తుపాను ప్రభావంతో ఉమ్మడి శ్రీకాకుళం,విజయనగరం,విశాఖపట్నం,తూర్పుగోదావరి, పశ్చిమగోదావరి,కృష్ణా జిల్లాల్లోని పలు ప్రాంతాల్లో భారీ వర్షాలు కురుస్తున్నాయి. బలమైన ఈదురుగాలులు కూడా వీస్తుండటంతో ప్రజలు ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. ముఖ్యంగా ఉమ్మడి ఉభయగోదావరి జిల్లాలపై తుపాను ప్రభావం ఎక్కువగా ఉంది. డాక్టర్‌ బీఆర్‌ అంబేడ్కర్‌ కోనసీమ జిల్లాలోని లోతట్టు ప్రాంతాలు నీట మునిగాయి. తుపాను గాలుల ధాటికి పలుచోట్ల కొబ్బరిచెట్లు నేలకూలాయి. విద్యుత్‌ సరఫరాకు తీవ్ర అంతరాయం ఏర్పడింది.

వివరాలు 

భారీ వర్షాలతో పాటు ఈదురుగాలులు

కాకినాడ జిల్లాలో ఎడతెరిపి లేకుండా వర్షాలు కురుస్తుండటంతో పాటు ఈదురుగాలులు వీస్తున్నాయి.

దీంతో ప్రధాన రహదారులపై చెట్లు కూలిపోయి వాహనాల రాకపోకలకు ఆటంకం ఏర్పడింది.

ఉప్పాడలో సముద్రపు అలలు ఉద్ధృతంగా ఎగసిపడటంతో బీచ్‌ రోడ్డు దెబ్బతింది. కాజులూరు ప్రాంతంలో చెట్లు, విద్యుత్‌ స్తంభాలు కూలిపోయాయి.

భారీ వర్షాల కారణంగా వరి పంటలు నీట మునిగాయి. పశ్చిమగోదావరి జిల్లా పాలకొల్లులోనూ అర్నబ్‌ తుపాను తీవ్ర ప్రభావం చూపింది.

బలమైన గాలులకు చెట్లు, విద్యుత్‌ స్తంభాలు, హోర్డింగ్స్‌ నేలకూలాయి. దీంతో ఆయా ప్రాంతాల్లో నష్టం వాటిల్లింది.

మరోవైపు యానాంలోనూ తుపాను ప్రభావం తీవ్రంగా కనిపించింది.

మంగళవారం అర్ధరాత్రి నుంచి భారీ వర్షాలతో పాటు ఈదురుగాలులు వీచాయి. ఫలితంగా అక్కడి లోతట్టు ప్రాంతాలు జలమయమయ్యాయి.

ADVERTISEMENT