Gulf of Aden: గల్ఫ్ ఆఫ్ ఎడెన్‌లో డ్రోన్ దాడి.. స్పందించిన యుద్ధనౌక INS విశాఖపట్నం
ఈ వార్తాకథనం ఏంటి
అమెరికాకి చెందిన 'జెన్‌కో పికార్డీ' అనే కంటైనర్ నౌకను లక్ష్యంగా చేసుకొని హౌతీ తిరుగుబాటుదారులు దాడికి పాల్పడిన విషయం తెలిసిందే.
ఈ విషయం తెలుసుకున్న భారత నౌకాదళం (Indian Navy)స్పందించింది. పోర్ట్ ఎడెన్‌కు దక్షిణంగా 60నాటికల్ మైళ్ల దూరంలో విధులు నిర్వహిస్తున్న భారత నావికాదళానికి చెందిన యుద్ధనౌక INS విశాఖపట్నం ఘటనా స్థలానికి పంపించినట్లు వెల్లడించింది.
''బుధవారం అర్ధరాత్రి సమయంలో మార్షల్ ఐలాండ్ జెండాతో ఉన్న 'ఎంవీ జెన్‌కో పికార్డీ' నౌకపై డ్రోన్ దాడి జరిగింది. సాయం కావాలని అభ్యర్థన రాగానే,గల్ఫ్ ఆఫ్ ఎడెన్‌లో యాంటీ-పైరసీ ఆపరేషన్‌లో ఉన్న మన డిస్ట్రాయర్ INS విశాఖపట్నం స్పందించింది. అర్ధరాత్రి తర్వాత జెన్‌కో పికార్డీ నౌక వద్దకు చేరుకుని సాయం అందించింది''అని భారత నౌకాదళం తెలిపింది.
Details
దాడి జరిగిన సమయంలో ఓడలో 22 మంది
దాడి జరిగిన సమయంలో ఆ ఓడలో 22 మంది సిబ్బంది(09 మంది భారతీయులు)ఉన్నారు.
ఈ ఘటనలో ఎవరికి ఎలాంటి హనీ జరగలేదని,మంటలు అదుపులోకి వచ్చినట్లు నేవీ తెలిపింది.
నౌక ఇప్పుడు దాని తదుపరి పోర్ట్ ఆఫ్ కాల్‌కి వెళుతోంది. ఇజ్రాయెల్ గాజాపై చేస్తున్న యుద్ధానికి నిరసనగా హౌతీలు ఈ దాడులు చేస్తున్నారు.
ఎర్ర సముద్రంలో ఇజ్రాయెల్, అమెరికా నౌకలనే లక్ష్యంగా చేసుకొని ఈ దాడులకు పాల్పడుతున్నారు.
అటు అమెరికా కూడా రక్షణ చర్యలకు దిగింది. యెమెన్‌లోని హౌతీ తిరుగుబాటుదారుల స్థావరాలపై క్షిపణి, వైమానిక దాడులు జరుపుతోంది.