
Nandini Milk: కర్ణాటకలో నందిని పాల ధరలకు షాక్.. లీటరుకు ఎంత పెరిగిందంటే?
ఈ వార్తాకథనం ఏంటి
కర్ణాటక ప్రభుత్వం ప్రజలకు షాకిచ్చింది. రాష్ట్రవ్యాప్తంగా నందిని పాల (Nandini Milk) ధరలను లీటరుకు రూ.4 పెంచుతూ నిర్ణయం తీసుకుంది.
కర్ణాటక మిల్క్ ఫెడరేషన్ (Karnataka Milk Federation - KMF), రైతు సంఘాల డిమాండ్ మేరకు సిద్ధరామయ్య ప్రభుత్వం ఈ నిర్ణయం తీసుకుంది.
ముందుగా లీటరుకు రూ.5 పెంచాలని ప్రతిపాదించగా, చివరకు రూ.4 పెంపు నిర్ణయించింది. తాజా నిర్ణయంతో ఒక లీటరు నందిని పాల ప్యాకెట్ (ప్రముఖ బ్లూ ప్యాకెట్) ధర రూ.44 నుంచి రూ.48కి పెరగనుంది.
Details
తరచూ పెరుగుతున్న నందిని పాల ధరలు
కేఎమ్‌ఎఫ్ గతంలోనూ పాల ధరలు పెంచిన సంగతి తెలిసిందే. చివరిసారిగా జూన్ 2024లో లీటరుకు రూ.2 పెంచగా, ఆందుకు ముందు జులై 2023లో రూ.3 పెంచింది.
ఈసారి ఏకంగా రూ.4 పెంపు నిర్ణయించడం గమనార్హం.
నిత్యావసరాల ధరల పెరుగుదల
పాల ధరల పెంపుతోపాటు, కర్ణాటక ప్రజలు ఇప్పటికే మరిన్ని ధరల భారాన్ని ఎదుర్కొంటున్నారు.
కాఫీ పౌడర్ ధరలు: కాఫీ బ్రూవర్ల సంఘం ప్రకారం, మార్చి నాటికి కిలోకు రూ.200 పెరుగనున్నాయి.
Details
బీఎంటీసీ బస్సులు, నమ్మ మెట్రో ఛార్జీలు
బస్సు, మరియు మెట్రో టికెట్ ఛార్జీలు ఇప్పటికే పెరిగాయి.
నీటి సుంకం
రాష్ట్ర ప్రభుత్వం నీటి సుంకాన్ని పెంచేందుకు పరిశీలిస్తోంది.
విద్యుత్ ఛార్జీలు
ఏప్రిల్ 1 నుంచి విద్యుత్ వినియోగదారులకు అదనంగా 36 పైసలు యూనిట్‌కు సర్‌చార్జి విధించనున్నారు.
విద్యుత్తు సరఫరా కంపెనీలను (ఎస్కామ్స్) కర్ణాటక విద్యుత్తు నియంత్రణ కమిషన్ (కేఈఆర్‌సీ) ఆదేశించింది.
ప్రజలకు భారం
నిత్యావసర వస్తువుల నుంచి నీరు, విద్యుత్ ఛార్జీలు, బస్సు, మెట్రో ఛార్జీల పెంపుతో ప్రజలు తీవ్ర ఆర్థిక భారం ఎదుర్కొంటున్న నేపథ్యంలో పాల ధరల పెంపు మరింత భారంగా మారనుంది.