Loading...
Tiger Shroff: టైగర్ ష్రాఫ్‌పై కాల్పులు.. పోలీసులకు చిక్కిన ముగ్గురు నిందితులు!
టైగర్ ష్రాఫ్‌పై కాల్పులు.. పోలీసులకు చిక్కిన ముగ్గురు నిందితులు!

Tiger Shroff: టైగర్ ష్రాఫ్‌పై కాల్పులు.. పోలీసులకు చిక్కిన ముగ్గురు నిందితులు!

వ్రాసిన వారు Jayachandra Akuri
Oct 19, 2026
12:35 pm

ఈ వార్తాకథనం ఏంటి

బాలీవుడ్ నటుడు టైగర్ ష్రాఫ్‌పై జరిగిన హత్యాయత్నం కేసులో పోలీసులు కీలక పురోగతి సాధించారు. ఈ దాడికి పాల్పడినట్లు అనుమానిస్తున్న ముగ్గురు షూటర్లను అరెస్ట్ చేశారు. రైలులో ప్రయాణిస్తుండగా రాజస్థాన్‌లోని కోట రైల్వే స్టేషన్‌లో వారిని పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. అరెస్టయిన నిందితులకు గ్యాంగ్‌స్టర్ లారెన్స్ బిష్ణోయ్ ముఠాతో సంబంధాలు ఉన్నట్లు తెలుస్తోంది. నిందితుల్లో ఇద్దరు హర్యానాకు చెందినవారు కాగా, మరొకరు మహారాష్ట్రకు చెందిన వ్యక్తి. ఏఎన్‌ఐ వార్తా సంస్థ కథనం ప్రకారం.. టైగర్ ష్రాఫ్‌పై దాడి చేసేందుకు నిందితులు పక్కా ప్రణాళిక రూపొందించినట్లు దర్యాప్తు సంస్థలు అనుమానిస్తున్నాయి. ఇందుకోసం కొన్ని రోజుల పాటు ఆయన దినచర్య, కదలికలపై నిఘా పెట్టి రెక్కీ నిర్వహించినట్లు సమాచారం.

వివరాలు

నిందితులు ముందుగానే ప్రణాళికలు సిద్ధం చేసినట్లు సమాచారం

ప్రతి ఆదివారం టైగర్ ష్రాఫ్ ముంబైలోని జుహు ఫుట్‌బాల్ గ్రౌండ్‌కు వస్తారనే విషయాన్ని గుర్తించిన నిందితులు.. అక్కడి నుంచి ఆయన కారులో తిరిగి వెళ్లే సమయంలో దాడి చేయాలని కుట్ర పన్నినట్లు దర్యాప్తులో వెల్లడైంది.

దాడి అనంతరం పోలీసులకు చిక్కకుండా తప్పించుకునేందుకు కూడా నిందితులు ముందుగానే ప్రణాళిక సిద్ధం చేసుకున్నట్లు తెలుస్తోంది.

ఎస్వీ రోడ్ మీదుగా వైల్ పార్లే, అంధేరి ప్రాంతాల గుండా పారిపోవాలని నిర్ణయించుకున్నారు.

ఇందులో భాగంగా అంధేరి వెస్ట్ రైల్వే స్టేషన్ సమీపంలో తమ మోటార్‌సైకిల్‌ను వదిలేశారు. అనంతరం అక్కడి నుంచి రైలులో బోరివలీకి వెళ్లారు.

వివరాలు

 కోట రైల్వే స్టేషన్‌లో నిందితుల గుర్తింపు 

ఆ తర్వాత పోలీసుల నుంచి తప్పించుకునేందుకు మహారాష్ట్ర సరిహద్దును దాటి గుజరాత్‌లోకి ప్రవేశించినట్లు ప్రాథమిక సమాచారం ద్వారా వెల్లడైంది.

అయితే అక్కడి నుంచి మరో ప్రాంతానికి వెళ్లేందుకు ప్రయత్నించిన క్రమంలో చివరకు రాజస్థాన్‌లోని కోట రైల్వే స్టేషన్‌లో పోలీసులకు చిక్కారు.

ఈ కేసులో నిందితులకు లారెన్స్ బిష్ణోయ్ ముఠాతో ఉన్నట్లు చెబుతున్న సంబంధాలపై పోలీసులు దర్యాప్తు చేస్తున్నట్లు తెలుస్తోంది.

టైగర్ ష్రాఫ్‌పై దాడికి దారితీసిన కారణాలు, కుట్ర వెనుక ఉన్న ఇతర వ్యక్తుల పాత్రపై మరిన్ని వివరాలు తెలియాల్సి ఉంది.

ADVERTISEMENT