Page Loader
సిక్కింలో వరద బీభత్సం.. 19కి చేరిన మరణాలు, 103 గల్లంతు 
19కి చేరిన మరణాలు, 22 మంది జవాన్లుతో పాటు 103 మంది గల్లంతు

సిక్కింలో వరద బీభత్సం.. 19కి చేరిన మరణాలు, 103 గల్లంతు 

వ్రాసిన వారు TEJAVYAS BESTHA
Oct 06, 2023
12:54 pm

ఈ వార్తాకథనం ఏంటి

ఈశాన్య భారతదేశంలోని సిక్కిం రాష్ట్ర భారీ వరదలతో అతలాకుతలమైంది. ఆకస్మికంగా సంభవించిన వరదలతో ఇప్పటికే 19 మంది మరణించారు. 22 మంది ఆర్మీ అధికారులు గల్లంతయ్యారు. తాజా మరణాలతో కలిపి మొత్తంగా 18 మంది మృత్యువాత పడ్డారు. 103 మంది గల్లంతయ్యారు. ఉత్తర సిక్కింలోని తీస్తా నదీ పరీవాహకలోని ఎల్‌హొనాక్‌ సరస్సులో సంభవించిన వరదల కారణంగా తాజాగా ఆరుగురి మృతదేహాలు లభ్యమయ్యాయి. ఈ మేరకు సిక్కిం విపత్తు నిర్వహణ ప్రాధికార సంస్థ(SSDMA) ప్రకటించింది. తాము ఇప్పటివరకు 2,011 మంది ప్రాణాలను రక్షించామన్నారు. మరోవైపు వరదల్లో కొట్టుకువచ్చిన 18 మృత దేహాల్లో 4 ఆర్మీ జవాన్లవేనని పశ్చిమ బెంగాల్ ప్రభుత్వం గుర్తించిదన్నారు.

DETAILS

భారీగా ధ్వంసమైన చుంగ్‌థంగ్‌ డ్యామ్‌ 

ఇంకోవైపు బుధవారం ఎదురైన ఆకస్మిక వరదలతో చుంగ్‌థంగ్‌ డ్యామ్‌ ధ్వంసమైంది. ఈ కారణంగా ఎక్కడికక్కడ విద్యుత్‌ సరఫరా నిలిచిపోయింది. ఒకరకంగా మౌలిక వ్యవస్థలు ఘోరంగా దెబ్బతిన్నాయి. దీంతో జన జీవన వ్యవస్థ ఊహించని రీతిలో స్థంభించింది. ఈ మేరకు 4 జిల్లాల్లోని గ్రామాలు, పట్టణాలు నీట మునిగాయి. మంగన్‌ జిల్లాలోని 8 వంతెనలతో పాటు మొత్తం 11 బ్రిడ్జీలు వరదల్లో కొట్టుకుపోయాయి. సిక్కింలోని వేర్వేరు ప్రాంతాల్లో వరదల్లో వేలాది మంది పర్యాటకులు చిక్కుకుపోయారు. అయితే ఇందులో విదేశీయులూ ఉండటం గమనార్హం.

ట్విట్టర్ పోస్ట్ చేయండి

సిక్కింలో కొనసాగుతున్న సహాయ చర్యలు