Page Loader
సిక్కింలో వరదల కారణంగా రోడ్లు, వంతెనలు కొట్టుకుపోయి 23 మంది ఆర్మీ జవాన్లు గల్లంతు 
సిక్కింలో వరదల కారణంగా రోడ్లు, వంతెనలు కొట్టుకుపోయి 23 మంది ఆర్మీ జవాన్లు గల్లంతు

సిక్కింలో వరదల కారణంగా రోడ్లు, వంతెనలు కొట్టుకుపోయి 23 మంది ఆర్మీ జవాన్లు గల్లంతు 

వ్రాసిన వారు Sirish Praharaju
Oct 04, 2023
10:22 am

ఈ వార్తాకథనం ఏంటి

సిక్కింలోని లాచెన్ వ్యాలీలోని తీస్తా నదిలో వరద ఉధృతి కారణంగా బుధవారం ఉదయం కనీసం 23 మంది ఆర్మీ సిబ్బంది గల్లంతయ్యారు. చుంగ్తాంగ్ డ్యామ్ నుండి నీటిని విడుదల చేయడం వల్ల పరిస్థితి మరింత తీవ్రమైంది, దీనివల్ల దిగువకు 15-20 అడుగుల ఎత్తు వరకు నీటి మట్టం పెరిగింది. సింగ్టామ్ సమీపంలోని బర్దంగ్ వద్ద పార్క్ చేసిన ఆర్మీ వాహనాలు వరద ప్రవాహంలో కొట్టుకుపోయాయి. గల్లంతైన సిబ్బంది ఆచూకీ కోసం గాలింపు చర్యలు కొనసాగుతున్నాయి. ఆకస్మిక వరద లాచెన్ లోయ వెంబడి ఉన్న అనేక ఆర్మీ స్థాపనలకు కూడా నష్టం కలిగించింది. పూర్తి స్థాయిలో నష్టాన్ని అంచనా వేసేందుకు ప్రయత్నాలు కొనసాగుతున్నాయి.

Details 

రాష్ట్రంలో హై అలర్ట్ ప్రకటించిన సిక్కిం ప్రభుత్వం  

నది పొంగి ప్రవహించడంతో తీస్తా నదిపై ఉన్న సింథమ్ ఫుట్ బ్రిడ్జి కూలిపోయింది. పశ్చిమ బెంగాల్‌లోని జల్‌పైగురి పరిపాలన యంత్రాగం ముందుజాగ్రత్త చర్యగా నది దిగువ పరివాహక ప్రాంతం నుండి ప్రజలను తరలిస్తున్నారు. సిక్కిం ప్రభుత్వం రాష్ట్రంలో హై అలర్ట్ ప్రకటించింది. తీస్తా నదికి దూరంగా ఉండాలని ప్రజలను కోరింది.

ట్విట్టర్ పోస్ట్ చేయండి

సిక్కింలో వరద ఉధృతి కారణంగా  23 మంది ఆర్మీ సిబ్బంది గల్లంతు